Cleanest Cities: అతి శుభ్రమైన నగరాల్లో ర్యాంకులు సాధించిన బెజవాడ, వైజాగ్

ఇక స్వచ్ఛమైన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‭గఢ్ రెండో స్థానం, మహారాష్ట్ర మూడో స్థానం సాధించాయి. వందకంటే ఎక్కువ అర్బన్ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపుర మొదటి స్థానంలో ఉంది. ఏపీకి సంబంధించి వివిధ విభాగాల్లో విజయవాడతోపాటు, తిరుపతి, విశాఖ పట్నం, పుంగనూరు, పులివెందులకు కూడా అవార్డులు దక్కాయి.

Cleanest Cities: అతి శుభ్రమైన నగరాల్లో ర్యాంకులు సాధించిన బెజవాడ, వైజాగ్

Cleanest Cities: దేశంలోని శుభ్రమైన నగరాల్లో తెలుగు నగరాలైన విజయవాడ, విశాఖపట్నం ఉన్నతమైన ర్యాంకులు సాధించాయి. ఈ రెండు నగరాలు వరుసగా నలుగో, ఐదో స్థానంలో నిలిచాయి. ‘స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవార్డుల జాబితా’ను కేటగిరీల వారీగా కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాకు సంబంధించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం శనివారం జరిగింది. కాగా, ఇందులో విశాఖపట్నం, విజయవాడ అవార్డులు అందుకున్నాయి.

ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో ఎప్పటిలాగే ఇండోర్ నగరం నిలిచింది. ఇండోర్ నగరం ఈ ఘనత సాధించడం ఇది ఆరోసారి. వరుసగా ఆరేళ్లుగా ఈ నగరమే మొదటి స్థానంలో వస్తూ ఉంది. ఇక నవీ ముంబై తన రెండవ స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాది విజయవాడ మూడో స్థానంలో నిలవగా ఈసారి నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మూడవ స్థానాన్ని నవీ ముంబైకి వదిలేసుకుంది.

CM KCR New Party: కేసీఆర్ కొత్త పార్టీ పేరు ఇదే.. ప్రకటనకు ముహూర్తం ఖరారు!

ఇక స్వచ్ఛమైన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‭గఢ్ రెండో స్థానం, మహారాష్ట్ర మూడో స్థానం సాధించాయి. వందకంటే ఎక్కువ అర్బన్ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపుర మొదటి స్థానంలో ఉంది. ఏపీకి సంబంధించి వివిధ విభాగాల్లో విజయవాడతోపాటు, తిరుపతి, పుంగనూరు, పులివెందులకు కూడా అవార్డులు దక్కాయి.

లక్షకంటే ఎక్కువ మంది ఉన్న స్వచ్ఛమైన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచగని మొదటి స్థానంలో నిలవగా, ఛత్తీస్‌ఘడ్‌లోని పటాన్ రెండో స్థానంలో, మహారాష్ట్రలోని కర్హాడ్ మూడో స్థానంలో ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్‪‌కు సంబంధించి ఇది ఏడో సర్వే. మొదటిసారి 2016లో ఈ సర్వే నిర్వహించారు. అప్పట్లో 73 నగరాలనే సర్వే చేయగా, ఇప్పుడు 4,354 పట్టణాలను సర్వే చేసి ఈ జాబితా వెల్లడించారు.

5G Launch in India : ఢిల్లీలో 5G సర్వీసులను ప్రారంభించిన జియో, ఎయిర్‌టెల్.. 5G ఫోన్లలో అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?