CM Jagan : కుటుంబానికి రూ.25 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం… సీఎం జగన్ కీలక నిర్ణయం

వర్ష బీభత్సంతో చెల్లాచెదురైన కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే అనంతరం బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా నష్టపరిహారం..

CM Jagan : కుటుంబానికి రూ.25 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం… సీఎం జగన్ కీలక నిర్ణయం

Cm Jagan Exgratia

CM Jagan : భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్తంభించింది. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. కొందరు అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరు అవుతున్నారు. వర్ష బీభత్సంతో చెల్లాచెదురైన కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే అనంతరం బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

Richest Youtubers : డబ్బే డబ్బు.. యూట్యూబ్ ద్వారా కోట్ల సంపాదన.. ఇండియా రిచెస్ట్ యూట్యూబర్స్..

వరద బాధితుల పట్ల మానవతా దృక్పథాన్ని చూపించాలని పిలుపునిచ్చిన సీఎం జగన్, వరద బాధితులను అదుకునేలా కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్షికంగా ఇళ్లు దెబ్బతింటే రూ.5,200, పూర్తిగా దెబ్బతింటే రూ.95 వేలు అందజేయాలన్నారు. ఇళ్లు పూర్తిగా ధ్వంసమైతే కొత్తగా మంజూరు చేయాలన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.

వరద సహాయక చర్యల్లో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవాలని.. నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి తోడుగా ఉండాలని జగన్ ఆదేశించారు. విపత్తులో సాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి… మిగిలిన వారిలో ధైర్యం నింపాడానికే ఈ చర్యలని జగన్ చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించి ముగ్గురు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించనున్నారు.

Airtel Prepaid Price Hike : ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. ప్రీ‌పెయిడ్ ఛార్జీల పెంపు..!

అలాగే వరద బాధిత కుటుంబాలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ ఆలూ, రూ.2వేలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ ప్రారంభమైంది.