ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15వేలు, సీఎం జగన్ మరో గుడ్ న్యూస్

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పాలనపై ఫోకస్ పెట్టారు. వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ

10TV Telugu News

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పాలనపై ఫోకస్ పెట్టారు. వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పాలనపై ఫోకస్ పెట్టారు. వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దూసుకెళ్తున్నారు. కరోనాతో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్నా పేదలకు అండగా నిలుస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న అనేకమందికి ఇప్పటికే ఆర్ధికంగా చేయూతనిచ్చారు సీఎం జగన్. తాజాగా మహిళల కోసం మరో వినూత్న పథకం తీసుకొచ్చారు. అదే ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’. పేద కాపు మహిళలను ఆర్ధికంగా ఆదుకోవడానికి ఈ స్కీమ్ తెచ్చారు.

ప్రతి ఏటా రూ.15వేలు, ఐదేళ్లలో రూ.75వేలు:
అర్హులైన పేద మహిళలకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో వారికి రూ.75 వేలు సాయం అందిస్తామని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. జూన్ 24న సీఎం జగన్ ఈ పథకం ప్రారంభించబోతున్నారు. తొలి ఏడాదికి గాను ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపుగా 2.36 లక్షల మహిళలకు లబ్ది చేకూరనుంది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన మహిళలకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 15 వేల చొప్పున సుమారు రూ.354 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.

అర్హతలు ఇవే:
* కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు అనర్హులు.
* గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12వేలు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులు
* కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి/ 10 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి
* 45-60 వయసు ఉన్న వారు అర్హులు
* కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్నా అనర్హులు
* కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
* ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు.

ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేశామని అధికారులు తెలిపారు. సామాజిక తనిఖీ, ఆ తర్వాత గ్రామ, వార్డు వలంటీర్ల వ్యక్తిగత తనిఖీలు, గ్రామ సచివాలయాల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ.. మళ్లీ సర్వే, తనిఖీలు.. ఇలా లబ్ధిదారులను ఎంపిక చేశారు.

Read: డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

10TV Telugu News