కరోనా కష్ట కాలంలో సీఎం జగన్ పెద్ద మనసు, వారికి రూ.5వేల సాయం

ఓవైపు కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూనే మరోవైపు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ఏపీ సీఎం జగన్. వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణకు ప‌క‌డ్బందీ

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 06:21 AM IST
కరోనా కష్ట కాలంలో సీఎం జగన్ పెద్ద మనసు, వారికి రూ.5వేల సాయం

ఓవైపు కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూనే మరోవైపు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ఏపీ సీఎం జగన్. వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణకు ప‌క‌డ్బందీ

ఓవైపు కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూనే మరోవైపు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ఏపీ సీఎం జగన్. వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణకు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తూనే, లాక్ డౌన్ వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల‌ను ఆదుకుంటున్నారు. ఇప్పటికే పలు వర్గాలకు సీఎం జగన్ సాయం అందించారు. ఆర్థిక సాయంతో పాటు రేషన్ ఇస్తున్నారు. ఏ ఒక్కరు కూడా పస్తులు ఉండకుండా చూస్తున్నారు. తాజాగా సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అర్చ‌కులు, ఇమామ్‌లు, పాస్ట‌ర్ల‌కు సీఎం జగన్ శుభ‌వార్త వినిపించారు.

లాక్ డౌన్ నేపధ్యంలో వీరికి రూ.5 వేల ఆర్ధిక సాయం అందించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ కార్పోరేషన్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ డబ్బుని నేరుగా అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తెలిపింది. కాగా ప్రభుత్వం నుంచి లేదా సంబంధిత మతసంస్థల నుంచి జీతం/ఉపకార వేతనం అందుకునే వారు మాత్రం దీనికి అర్హులు కారని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పాస్టర్లు, ఇమామ్ లు, అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

క‌రోనా నేప‌థ్యంలో దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్ర‌భుత్వ, ప్రైవేటు రంగాలు అన్ని మూత‌ప‌డ్డాయి. విద్యా, వ్యాపార, ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు స్థంబించాయి. ఆఖ‌రుకు దేవాల‌యాలు, మసీదులు, చర్చిలకు కూడా తాళాలు వేశారు. దర్శనాలు నిలిపివేశారు. దీంతో అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కొంత ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.