CM Jagan : సీఎం జగన్‌ మరో సంచలన నిర్ణయం, ఆ కాలేజీలకు ప్రత్యేకాధికారాలు రద్దు, తల్లుల ఖాతాల్లో నగదు

విద్యారంగంలో ఏపీ సీఎం జగన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అటానమస్‌ కాలేజీలకు ప్రత్యేకాధికారాలను రద్దు చేశారు. అటానమస్‌ కాలేజీల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆదేశించారు.

CM Jagan : సీఎం జగన్‌ మరో సంచలన నిర్ణయం, ఆ కాలేజీలకు ప్రత్యేకాధికారాలు రద్దు, తల్లుల ఖాతాల్లో నగదు

Cm Jagan

CM Jagan Cancels Self Exams : విద్యారంగంలో ఏపీ సీఎం జగన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అటానమస్‌ కాలేజీలకు ప్రత్యేకాధికారాలను రద్దు చేశారు. అటానమస్‌ కాలేజీల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో అటానమస్‌ కాలేజీల్లో పరీక్షా విధానంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. కీలక మార్పులకు ఆదేశాలు ఇచ్చారు.

అన్ని కాలేజీలకు జేఎన్టీయూ నుంచే:
అటానమస్‌ కాలేజీలు సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేశారు. ఇకపై అన్ని కాలేజీకు జేఎన్టీయూ తయారు చేసిన ప్రశ్నాపత్రాలే అందించాలని ఆదేశించారు. నాన్‌ అటానమస్‌ కాలేజీలకూ ఇవే క్వశ్చన్ పేపర్లు ఉంటాయన్నారు. అంతేకాదు పేపర్‌ వాల్యుయేషన్‌ కూడా జేఎన్‌టీయూకే అప్పగించాలని సీఎం నిర్ణయించారు. పరీక్షల నిర్వహణలో అక్రమాల నిరోధానికే ఈ మార్పులు చేపడుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

డిగ్రీ పట్టా అందుకుంటే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలి:
డిగ్రీ పట్టా అందుకుంటే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలన్నారు సీఎం జగన్. నైపుణ్యం లేకుంటే కనీసం ఇంటర్వ్యూను కూడా ఎదుర్కోలేరని చెప్పారు. అందుకే, ప్రతి కోర్సులో అప్రెంటిస్ విధానం తీసుకురావాలని నిర్ణయించామన్నారు. కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు ఏం విలువ ఉంటుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యావిధానాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్ కొత్త కోర్సులు, సబ్జెక్టులతో మార్పులు తీసుకురావాలని సూచించారు. విశాఖలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకొచ్చి.. ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు.

ఉగాది నుంచి ఉద్యోగాలకు క్యాలెండర్:
ఈ ఏడాది భర్తీ చేయనున్న ఉద్యోగాలపై క్యాలెండర్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదల చేసేలా చూడాలన్నారు. ఈ ఏడాది 6వేల పోలీసు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధుల విడుదల చేయాలన్నారు.

తల్లుల ఖాతాల్లో డబ్బులు:
ఇక జగనన్న విద్యా దీవెన, వసతి దీవనపై సీఎం సమీక్షించారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవన కింద ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఏప్రిల్ 27న వసతి దీవెన విడుదలపై అధికారులతో చర్చించారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన డబ్బులు, దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి కలగనుంది. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50వేల వరకూ పెరుగుదల వచ్చిందని అధికారులు తెలిపారు.