CM Jagan: వైజాగ్ ఆర్కే బీచ్ వేదికగా సీఎం జగన్.. ‘ఇవాళ గర్వించదగ్గ రోజు’

వైజాగ్ ఆర్కే బీచ్‌లో మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. అంతకంటే ముందు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్న సీఎం గౌరవ వందనం అందుకున్నారు.

CM Jagan: వైజాగ్ ఆర్కే బీచ్ వేదికగా సీఎం జగన్.. ‘ఇవాళ గర్వించదగ్గ రోజు’

Cm Jagan

CM Jagan: వైజాగ్ ఆర్కే బీచ్‌లో మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. అంతకంటే ముందు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్న సీఎం గౌరవ వందనం అందుకున్నారు. సతీసమేతంగా నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ‘ మిలాన్ 2022 విశాఖలో నిర్వహించడం గర్వకారణం. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగ్గ రోజు. సిటీ పరేడ్లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇది అరుదైన వేడుక, విన్యాసాల పండగ. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశాం. ఈ విన్యాసాల్లో పాల్గొన్న అందరికీ  అభినందనలు’ అని తెలిపారు.

మిలాన్ 2022 సందర్భంగా ఆర్కే బీచ్ ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. యుద్ధ విన్యాసాలు వీక్షించేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. వేడుకల్లో పాల్గొనేందుకు 39 దేశాల ప్రతినిధులతో పాటు 13 దేశాల యుద్ధనౌకల సిబ్బంది హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలు కన్నుల విందు చేశాయి.

Read Also : INS విశాఖ నౌక జాతికి అంకితం.. అలరించిన యుద్ధ విన్యాసాలు