CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేసిన సీఎం జగన్

బడికి పంపిస్తే ప్రతి ఏటా 15000 అందిస్తున్నామని వెల్లడించారు. ఎంత మంది ఎక్కువ చదివితే తనకు అంత ఆనందం అన్నారు. పిల్లలు స్కూలుకు వెలితేనే ఆనందం.. అప్పుడె చదువు వస్తుందన్నారు. బడికి వెలితేనే పధకం వస్తుందని ఆనాడే జీవో ఇచ్చామని గుర్తు చేశారు.

CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేసిన సీఎం జగన్

AP CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులను సీఎం జగన్ పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ పర్యటించిన సీఎం జగన్.. అమ్మఒడి మూడో విడుత డబ్బులను విడుదల చేశారు. జగనన్న అమ్మ ఒడి డబ్బులు బటన్ నొక్కి ఖాతాలలో వేస్తామని చెప్పారు. అమ్మ ఒడి ఒక్క స్కీం ద్వారానే మూడేళ్లలో అక్క చెల్లల ఖాతాలలో మొత్తం 19618 కొట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ప్రతి తల్లి తన బిడ్డలను మంచిగా చదివించాలనుకుంటుందన్నారు. ఓవైపు చదివించాలని ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు బాధపెడుతుంటాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవెరుస్తున్నామని తెలిపారు.

బడికి పంపిస్తే ప్రతి ఏటా 15000 అందిస్తున్నామని వెల్లడించారు. ఎంత మంది ఎక్కువ చదివితే తనకు అంత ఆనందం అన్నారు. పిల్లలు స్కూలుకు వెలితేనే ఆనందం.. అప్పుడె చదువు వస్తుందన్నారు. బడికి వెలితేనే పధకం వస్తుందని ఆనాడే జీవో ఇచ్చామని గుర్తు చేశారు. 75% హాజరు తప్పనిసరి చేసింది పిల్లలు స్కుల్ కి వెల్లాలనేనని చెప్పారు. హాజరు నిభందన అమలు చేయటంతో 51 వేల మంది పిల్లలకు అమ్మ ఒడి ఇవ్వలేఖ పోయామని పేర్కొన్నారు. 1.14 % ఇవ్వలేకపొవం చాలా భాదగా ఉందన్నారు.

CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్

భవిష్యత్ లో 75% హాజరుతో బడులు ఉండాలంటే నిభందన ఉండాలని భాద్యతతో బాధగా ఉన్నా న్యాయం చేయలేకపోయామన్నారు. ప్రతి పిల్లాడు, పాప బ్రతుకు మారాలని తపనతో అడుగులు వేస్తున్నామని తెలిపారు. అమ్మ ఒడి , నాడు నేడు, విద్యాకానుక , గోరుముద్ద, బై జ్యుస్ ఒప్పంద అన్నీ పిల్లల బవిష్యత్ కొసం తీసుకొచ్చిన వచ్చిన పధకాలేనని చెప్పారు.
ఇంత పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం కనుక విద్యారంగంలో మార్పు కనిపిస్తుందన్నారు. ప్రభుత్వ స్కూల్లలో విధ్యార్థుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. మంచి చేసే మీ జగన్ అన్న మీద విమర్శలు చేసేవారు ఎలాంటి వారో ఆలొచించండి అని అన్నారు.

ఈరోజు కుయుక్తులు, కుతంత్రంతో యుద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ఒక్కడితో యుద్ధం చేయటం లేదు దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని తెలిపారు. వీరందరికి ఒక దత్త పుత్రుడు తోడుగా ఉన్నాడని విమర్శించారు. మీ జగన్ కు మీ ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నంత వరకూ వెంట్రుకలు కూడా పీకలేరని అన్నారు. ఒకే విషయం చెప్పదలచుకున్నా.. దుష్టచతుస్టయం ప్రచారం నమ్మకండి అన్నారు. ప్రభుత్వం ద్వారా‌ మనకు మంచి జరిగిందా లేదా ఆలోచించండి అని పేర్కొన్నారు. మీకు మంచి జరిగిందా లేదా కొలబద్దగా తీసుకొండి అని అన్నారు.