పవన్‌ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్‌ రూ.10 లక్షల ఆర్థిక సాయం

10TV Telugu News

పవన్‌ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్‌ రూ.10 లక్షలు మంజూరు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే సీఎం జగన్ పవన్ కళ్యాణ్ అభిమానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్‌ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని సీఎంవో అధికారులు తెలిపారు.


×