CM Jagan On Guntur Stampede : గుంటూరులో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, అధికారులకు కీలక ఆదేశం

గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం కలచివేసిందన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.(CM Jagan On Guntur Stampede)

CM Jagan On Guntur Stampede : గుంటూరులో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, అధికారులకు కీలక ఆదేశం

CM Jagan On Guntur Stampede : గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం కలచివేసిందన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

తొక్కిసలాట ఘటనలో గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి విడదల రజిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుపై మంత్రి రజిని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి ముగ్గురు మహిళలు బలయ్యారని మండిపడ్డారు.

Also Read..Stampede In Guntur: చంద్రబాబు సభలో మరోసారి కలకలం… తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతి

గోరంత ఇచ్చి కొండంత ఇస్తున్నట్లు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. మొన్న కందుకూరులో 8మంది అమాయకులు చనిపోయారని మంత్రి వాపోయారు. వరుస ఘటనలకు చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు మంత్రి విడదల రజిని. అధికారం కోసం, టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు.. చంద్రబాబు.. ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మంత్రి రజిని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలన్నారు.

చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈసారి గుంటూరు వికాస్ నగర్ లో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. వారంతా గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.

Also Read..Kandukur Accident: చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురి మృతి.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు

గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత చంద్రన్న కానుక పంపిణీ ప్రారంభించారు. కానుకలు తీసుకునేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మృతి చెందారు. ఓ మహిళ స్పాట్ లోనే మరణించగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

సభ వద్ద మరణించిన మహిళను ఏటీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవిగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమా ప్రాణాలు విడిచారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గుంటూరు వికాస్ నగర్ లో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగినంత సేపు సజావుగానే ఉన్న సభ, ఆయన వెళ్లిపోయిన తర్వాత అదుపుతప్పింది. కార్యక్రమ నిర్వాహకులు, టీడీపీ నేతలు పరిస్థితిని కంట్రలో చేయలేకపోయారు. కానుకల కోసం మహిళలు ఎగబడ్డారు. దీంతో ఘోరం జరిగిపోయింది.