Explosion In Fireworks Center: కడియద్దలో పేలుడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు 10లక్షల ఎక్స్‌గ్రేషియా

తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామం వద్ద బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

Explosion In Fireworks Center: కడియద్దలో పేలుడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు 10లక్షల ఎక్స్‌గ్రేషియా

AP Cm Jagan

Explosion In Fireworks Center: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామం వద్ద బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈఘటన సమాచారం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతులకు 10లక్షలు ఎక్స్ గ్రేషియాను జగన్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Explosion In Fireworks Center: బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. నలుగురు సజీవదహనం

కడియద్దలో జరిగిన అగ్నిప్రమాద సంఘటన స్థలానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడియద్ద.గ్రామంలో ఒక దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుందని, గడపగడపకు కార్యక్రమంలో ఉన్న సమయంలో సమాచారం తెలిసిన వెంటనే అధికారులను హూటాహూటీన సంఘటన స్థలంకు పంపించి సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. దీపావళి సమయంలో కూడా అధికారులు అనేకసార్లు ఇక్కడ పరిశీలించారని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరుగుతుందని మంత్రి అన్నారు.

Cracker Factory Explosion: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి, 13 మందికి గాయాలు

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం అగ్ని ప్రమాదం పై అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మందు గుండు సామగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, వెంటనే ఎమ్మార్వో, ఆర్డీవోలను ఘటనా స్థలానికి పంపించడం జరిగిందని తెలిపారు. అధికారులందరూ రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారన్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెంలో లైసెన్సుడ్ షాప్ లో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. ముగ్గురు లోపలికి వెళ్లారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఘటనపై విచారణ చేపట్టారని తెలిపారు.