CM Jagan 175 Target : 175కు 175 సాధ్యమే.. ఈసారి గెలిస్తే మరో 30ఏళ్లు మనమే- కార్యకర్తలతో సీఎం జగన్ ధీమా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని వైసీపీ శ్రేణులతో అన్నారు సీఎం జగన్. మనం అనుకున్న లక్ష్యం ఎందుకు సాధ్యం కాదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.

CM Jagan 175 Target : 175కు 175 సాధ్యమే.. ఈసారి గెలిస్తే మరో 30ఏళ్లు మనమే- కార్యకర్తలతో సీఎం జగన్ ధీమా

CM Jagan Target 175 : ఏపీలో అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు సీఎం జగన్, అటు మాజీ సీఎం చంద్రబాబు.. ఎవరి ప్లాన్స్ లో వారున్నారు. ఇరు నేతలు తమ తమ పార్టీల కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. వరుస సమీక్షలతో ఎన్నికలకు రెడీగా ఉండాలని మేసేజ్ లు పంపుతున్నారు.

మరోసారి ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని వైసీపీ శ్రేణులతో అన్నారు సీఎం జగన్. వైజాగ్ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశంలో సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారు. మనం అనుకున్న లక్ష్యం ఎందుకు సాధ్యం కాదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందన్నారు సీఎ జగన్. కుప్పం లాంటి నియోజకవర్గంలో కూడా క్లీన్ స్వీప్ చేశామని అన్నారు జగన్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని, సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు జగన్. అందులో కార్యకర్తల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని జగన్ చెప్పారు.

”మరో 16 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. కార్యకర్తలు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి. సమయం ఉంది కదా అని కార్యకర్తలు ఉదాసీన వైఖరి కనబర్చరాదు. ప్రతి వార్డులో, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆశీస్సులు తీసుకోవాలి. రాష్ట్రంలో 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలి. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తా… 175 సీట్లు ఎందుకు రావు?” అంటూ ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు జగన్.

ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని, చేసిన పనులను గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో మీ భాగస్వామ్యం ఎంతో అవసరం అని కార్యకర్తలకు సూచించారు జగన్.