CM Jagan : మహిళలను చంద్రబాబు మోసం చేశారు, ఆ భారం మోయలేనిది

టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టొద్దని అప్పటి టీడీపీ

CM Jagan : మహిళలను చంద్రబాబు మోసం చేశారు, ఆ భారం మోయలేనిది

Cm Jagan

CM Jagan : టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టొద్దని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పిందని… దీంతో డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించలేదని… చివరకు రుణభారం పెరిగిపోయి వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఆ రుణాలను నాలుగు దఫాలుగా తమ ప్రభుత్వమే చెల్లిస్తోందని చెప్పారు.

”2014లో అక్కాచెల్లెమ్మల రుణాలను చంద్రబాబు మాఫీ చేసి ఉంటే ఆ భారం అక్కడితో పోయేది. మహిళలను చంద్రబాబు ఆదుకోలేదు. చివరకు మొత్తం వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. చంద్రబాబు వల్ల ఏ గ్రేడ్ లో ఉన్న ద్వాక్రా సంఘాలన్నీ సీ గ్రేడ్ లోకి పడిపోయాయి” అని జగన్ వాపోయారు.

Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

వైఎస్ఆర్ చేనేత, ఆసరా పథకాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. మహిళలను ఆదుకోవాలనే ఆసరా, చేయూత కార్యక్రమాలను తీసుకొచ్చామని జగన్ చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. తొలి విడత ఆసరా కింద 8 లక్షలకు పైగా డ్వాక్రా గ్రూపులకు రూ. 6,330.58 కోట్లు చెల్లించామని తెలిపారు. రెండో విడత ఆసరాకు సన్నాహకాలు చేస్తున్నామని అధికారులు సీఎంతో చెప్పారు. లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు.

2016లో రద్దయిన సున్నా వడ్డీ రుణాలను పునరుజ్జీవింపజేశామని జగన్ చెప్పారు. మహిళలను ఆదుకోవడమే కాకుండా రిలయన్స్, అమూల్, ఐటీసీ వంటి కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించామన్నారు. ఈ ఏడాది రిలయన్స్‌కు చెందిన అజియో, టనాజెర్, గ్రామీణ వికాస్‌ కేంద్ర, మహీంద్రా, గెయిన్, కల్‌గుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వివరించారు. ఆసరా, చేయూత కింద ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధికి వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సుస్థిర జీవనోపాధి మార్గాలతో విజయవంతమైన మహిళల ద్వారా ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలని సూచించారు. వారు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు, పశుపోషణ ద్వారా పొందుతున్న ఆదాయాల వివరాలను ఇతర మహిళలకు వివరించాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.

కరోనా మన జీవితాల్లో భాగంగా ఉండిపోతుందా? పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులకు ఇదే నిదర్శనమా?

”ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమ చేసుకోలేని విధంగా అన్‌ ఇంకబర్డ్‌ ఖాతాల్లో జమ చేయాలి. స్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులు రుణాలు ఇప్పించేలా స్పాట్‌ డాక్యుమెంటేషన్‌ జరిగేలా చూడాలి. ఇళ్ల లబ్ధిదారులైన అక్కచెల్లెమ్మలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని” సీఎం జగన్ సూచించారు.