CM Jagan : ఆడపిల్లల పరువు తీస్తున్నారు, సీఎం జగన్ ఆవేదన

తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లల పరువు తీస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల గౌరవాన్ని మంట కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో

CM Jagan : ఆడపిల్లల పరువు తీస్తున్నారు, సీఎం జగన్ ఆవేదన

Cm Jagan

CM Jagan : తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లల పరువు తీస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల గౌరవాన్ని మంట కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో తాజా ఘటనలపై సీఎం జగన్ ఆవేదన చెందారు. చేయాల్సిందంతా చేసినా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విపక్షాలపై జగన్ సీరియస్ అయ్యారు. విపక్షాల వైఖరని జగన్ తప్పుపట్టారు. పార్టీల ప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ సూచించారు. తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం సీఎం జగన్‌ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, సీజనల్‌ వ్యాధుల నివారణ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్ నిర్మాణంపై సమీక్ష చేశారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

‘గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలి. కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి. సగటున 1300 కేసులకు పడిపోయినప్పటికీ మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతం ఉన్నప్పటికీ మనం అప్రమత్తంగానే ఉండాలి. కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలి. పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలి’ అని సీఎం జగన్ అన్నారు.