సీఎం జగన్ మరో గుడ్ న్యూస్, రేపే 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ

  • Published By: naveen ,Published On : July 2, 2020 / 02:41 PM IST
సీఎం జగన్ మరో గుడ్ న్యూస్, రేపే 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ

* ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం
* ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’(APCOS) ద్వారా ప్రయోజనం
* శుక్రవారం(జూలై 3,2020) క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమం
* 47వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ
* లంచాలకు, సిఫారసులుకు తావులేదు
* దళారీల ప్రమేయం లేదు
* మత, ప్రాంత వివక్షకు తావులేదు
* ఠంచనుగా నెల తిరిగేసరికి పూర్తి జీతం
* ESI, EPF విధానాలు సక్రమంగా అమలు
* ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు యాభై శాతం అవుట్‌ సోర్స్‌ ఉద్యోగాలు
* మొత్తంగా యాభై శాతం ఉద్యోగాలుమహిళలకు
* అవుట్‌ సోర్సింగ్‌ సేవల్లో పారదర్శకత
* దళారీతనం, లంచగొండితనం, అవినీతి నిర్మూలన
* ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పూర్తిగా వేతనాలు చెల్లింపు
* ఏజెన్సీల పేరిట కమీషన్ల దోపిడీకి అడ్డుకట్ట

‘ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో లంచాలు తీసుకోవడం, ఉద్యోగం కోసం లంచాలు.. తర్వాత జీతాలు ఇవ్వాలి అంటే మాకింత ఇస్తేనే అని చెప్పి అక్కడా లంచాలు.. ఇటువంటి పరిస్థితిలో టోటల్‌గా ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అంతా కూడా నష్టపోతున్నారు’. ‘ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకువస్తూ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగే విధంగా, ఆ ఉద్యోగుల కోసం ప్రభుత్వమే స్వయంగా ఒక ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీగా ఏర్పడి, నేరుగా వారికి సేవలందించేందుకు, వారి జీతాలు ఏ మాత్రం తగ్గకుండా వారికే మొత్తం అందేలా చూడడం కోసం, ఎక్కడా కూడా లంచాలు అనే పరిస్థితి రాకుండా ఉండడం కోసం.. ఆంధ్రప్రదేశ్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం’. అసెంబ్లీ సాక్షిగా 2019 డిసెంబర్ 17న ఈ ప్రకటన చేసిన సీఎం జగన్, ఇప్పుడు దాన్ని కార్యరూపం దాల్చేలా చేశారు. అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్-APCOS‌) ఏర్పాటవుతోంది.

శుక్రవారం(జూలై 3,2020) ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆప్కాస్‌ ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారితో మాట్లాడతారు. ఈ సందర్భంగా 47 వేల మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ జారీ చేస్తారు.

కార్పొరేషన్‌ లక్ష్యం:
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు పూర్తిగా చెల్లించడంతో పాటు, ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేయడం. ఇంకా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, వాటన్నింటిలో మహిళలకు 50 శాతం ఇవ్వడం కూడా ఆప్కాస్‌ లక్ష్యం.

ఆప్కాస్‌ ప్రధాన విధులు:
* పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌ స్కిల్డ్‌ మ్యాన్‌ పవర్‌ గుర్తింపు.
* వివిధ శాఖలు, సంస్థల అవసరాలు తీర్చే విధంగా పూర్తి శాస్త్రీయ కోణంలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక.
* ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా ఆ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందేలా చూడడం.
* చట్టబద్ధంగా వారికి ఉన్న సదుపాయాలు.. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)తో పాటు, ఈఎస్‌ఐ వంటివి అందేలా చేయడం.
* హౌజ్‌ కీపింగ్, సెక్యూరిటీ, కేటరింగ్, వాహనాల అద్దె వంటి కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలను గుర్తించి, వారి అవసరాల మేరకు ఉద్యోగులను ఆప్కాస్‌ ద్వారా అందించండి.
* రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు, కార్యాలయాల్లో అవసరమైన ఔట్‌ సోర్సింగ్‌ ప్రక్రియలన్నింటికీ ‘వన్-స్టాప్-షాప్‌’ గా ఆప్కాస్‌ పని చేస్తుంది.

100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ:
* ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా ఈ కార్పొరేషన్‌ పని చేస్తుంది. ఇది నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ.

ఆప్కాస్‌లో ఎవరెవరు?:
* ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌కు ఛైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. ఒక మేనేజింగ్, మరొక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో పాటు, ఆరుగురు డైరెక్టర్లు ఉంటారు.
* ఆర్థిక శాఖకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి, ఏపీ హెచ్‌ఆర్‌డీ సంస్థ డీజీ, న్యాయ శాఖ కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్‌తో పాటు, మానవ వనరుల రంగానికి చెందిన ఇద్దరు నిపుణులు ఈ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు.
* కార్పొరేషన్‌కు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తారు.

కార్పొరేషన్‌తో ప్రయోజనాలు:
* ప్రైవేటు ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలు, దళారులు తొలగిపోతారు.
* అవినీతి లేకుండా ఔట్‌ సోర్సింగ్

Read:ఏపీలో 16వేలు దాటిన కరోనా కేసులు, ఆ 3 జిల్లాల్లో పరిస్థితి భయానకం