పెన్షన్ల గురించి సీఎం జగన్ గుడ్ న్యూస్

పెన్షన్ల గురించి సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. లబ్దిదారులు పెన్షన్ల కోసం అధికారులు, ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని తీసుకోవచ్చు.

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 04:59 AM IST
పెన్షన్ల గురించి సీఎం జగన్ గుడ్ న్యూస్

పెన్షన్ల గురించి సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. లబ్దిదారులు పెన్షన్ల కోసం అధికారులు, ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని తీసుకోవచ్చు.

పెన్షన్ల గురించి సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. లబ్దిదారులు పెన్షన్ల కోసం అధికారులు, ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని తీసుకోవచ్చు. ఇందుకోసం సీఎం జగన్ ఏర్పాట్లు చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటికే వచ్చి పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి వాలంటీర్లు స్వయంగా లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్లు ఇవ్వాలని సీఎం చెప్పారు. బుధవారం(జనవరి 8,2020) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సర్వేలతో ముడిపెట్టి ఇళ్ల పట్టాలను నిరాకరించొద్దని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ఆదేశాలిచ్చారు. అలాగే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను త్వరలో పూర్తి చేయాలన్నారు.

15,971 పోస్టులు భర్తీ:
నాడు-నేడు కింద స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌ గ్రిడ్‌ అంశాలపైనా సీఎం సమీక్షించారు. మినీ గోడౌన్ల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో స్కూళ్లలో ప్రహరీలు నిర్మించాలన్నారు. అలాగే నిరుద్యోగులకు మరో శుభవార్త వినిపించారు సీఎం జగన్. కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యాయన్నారు. వాటి ద్వారా మరో 3 వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 15వేల 971 పోస్టులను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.

Also Read : Viral Video : కోడిగుడ్డు పెంకు తీయడం ఇంత సులువా