CM Jagan Vaccine : 18ఏళ్లు పైబడిన వాళ్లకు ఇప్పట్లో టీకా లేదు, ఫిబ్రవరి వరకు జాగ్రత్త… సీఎం జగన్

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ కీలక, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యాక్సిన్ కొరత, ఉత్పత్తి సామర్ధ్యంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. దేశ జనాభా, రాష్ట్రాల అవసరాలు, వ్యాక్సిన్ ఉత్పత్తి గణాంకాలను బేరీజు వేసుకున్న సీఎం జగన్… వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పుడప్పుడే కార్యరూపం దాల్చదని పరోక్షంగా చెప్పారు. అంతేకాదు 2022 ఫిబ్రవరి దాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ తన అభిప్రాయం చెప్పారు.

CM Jagan Vaccine : 18ఏళ్లు పైబడిన వాళ్లకు ఇప్పట్లో టీకా లేదు, ఫిబ్రవరి వరకు జాగ్రత్త… సీఎం జగన్

Cm Jagan Vaccine

CM Jagan Vaccine : రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ కీలక, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ ఓ సమస్యగా మారిందన్న సీఎం జగన్… దేశంలో వ్యాక్సిన్ కొరత, ఉత్పత్తి సామర్ధ్యంపై హాట్ కామెంట్స్ చేశారు. దేశ జనాభా, రాష్ట్రాల అవసరాలు, వ్యాక్సిన్ ఉత్పత్తి గణాంకాలను కంపేర్ చేసిన సీఎం జగన్… వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పుడప్పుడే కార్యరూపం దాల్చదని పరోక్షంగా చెప్పారు. అంతేకాదు 2022 ఫిబ్రవరి దాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ తన అభిప్రాయం చెప్పారు.



కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారం అని సీఎం జగన్ తేల్చి చెప్పారు. అయితే వ్యాక్సినేషన్ సమస్య ఎప్పటికి తీరుతుందో తెలియడం లేదన్నారు. అయినప్పటికి.. వచ్చే ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలో అందరికీ టీకా ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కాగా, 18 నుంచి 45 ఏళ్లు లోపు వయసు వారికి ఇప్పట్లో టీకా లేదన్న సీఎం జగన్, వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ అందిస్తామని అన్నారు. 2022 ఫిబ్రవరి వరకు అందరం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కరోనా విషయంలో సానిటేషన్ అనేది చాలా కీలకం అని అందరూ చాలా శుభ్రంగా ఉండాలని జగన్ చెప్పారు.

దేశంలో వాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు కాగా, అందులో కోటి వ్యాక్సిన్లు కోవాక్సిన్‌… మిగిలినవి కొవిషీల్డ్ అని జగన్ చెప్పారు. దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు 26 కోట్ల మంది ఉన్నారని, వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో డోస్‌ ఇవ్వాలని.. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వ్యాక్సిన్లు కావాలన్నారు. తొలి డోస్‌ ఇప్పటివరకు 15 కోట్ల మందికి మాత్రమే వేశారని, 2.60 కోట్ల మందికి ఇప్పటి వరకు రెండో డోస్‌ మాత్రమే వేశారని చెప్పారు.



మొత్తం కలిపి చూసినా ఇప్పటివరకు వేసిన వాక్సిన్‌ డోస్‌లు దాదాపు 18 కోట్లు మాత్రమే.. అంటే ఇంకా 39 కోట్ల వాక్సిన్‌ డోస్‌లు కావాలన్నారు. భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి వాక్సిన్లు తయారు చేస్తుండగా, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 6 కోట్ల వాక్సీన్లు తయారు చేస్తోందన్నారు. వీటితో పాటు రెడ్డీ ల్యాబ్స్‌.. ఇతర సంస్థల ఉత్పత్తులు రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుందన్నారు. అన్నీ కలిపి ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి కావొచ్చన్నారు. దానికి తోడు ఇప్పుడున్న 7 కోట్లు కూడా కలుస్తాయన్నారు. ఈ లెక్కన 39 కోట్ల వ్యాక్సిన్ డోసులకు డిమాండ్‌ ఉందన్నారు. కాబట్టి ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి కానీ వ్యాక్సినేషన్ పూర్తి కాదన్నారు.

అదే విధంగా.. 18-45 ఏళ్ల మధ్య వయస్సున్న వారు దేశంలో 60 కోట్లు ఉన్నారు.. ఆ మేరకు వారికి 120 కోట్ల కరోనా వాక్సిన్‌ డోసులు కావాలి.. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వాక్సినేషన్‌ పూర్తయ్యాక, 18-45 ఏళ్ల మద్య వయస్సు వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఇవ్వొచ్చని అంచనా వేశారు. ఆ మేరకు వారికి వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుందన్నారు. అంటే వచ్చే ఏడాది (2022) జనవరి చివరి నాటికి వారందరికీ టీకా ఇవ్వగలుగుతామన్నారు. ఇదీ వాస్తవ పరిస్థితి అని సీఎం జగన్ చెప్పారు. కాబట్టి వచ్చే ఏడాది దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ కుండబద్దలు కొట్టారు.