పోలవరంలో మేఘా పనులు : షిఫ్టుల వారీగా రోజుకు 5వేలకుపైగా కార్మికులు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించడానికి సీఎం జగన్‌ ఇవాళ వెళ్లనున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 02:55 AM IST
పోలవరంలో మేఘా పనులు : షిఫ్టుల వారీగా రోజుకు 5వేలకుపైగా కార్మికులు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించడానికి సీఎం జగన్‌ ఇవాళ వెళ్లనున్నారు.

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించడానికి సీఎం జగన్‌ శుక్రవారం (ఫిబ్రవరి 28, 2020) వెళ్లనున్నారు. పోలవరం నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరీశీలించనున్నారు. ఉదయమే బయలుదేరి ఆయన పోలవరం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు.

క్షేత్రస్థాయిలో పోలవరం పనులను పరిశీలించనున్నారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులతో భేటీ అయి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం… ఆ మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అన్నదానిపై జగన్‌ సమీక్షించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభమైన పోలవరం
ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసి ఖరీఫ్‌ పంటకు నీళ్లివ్వడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైఎస్‌ హయాంలో ఈ ప్రాజెక్టుకు కాల్వలు తవ్వారు. టీడీపీ హయాంలో కొన్ని పనులు చేపట్టారు.  

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లింది. 628 కోట్ల రూపాయలమేర ఆదా చేస్తూ నిర్మాణ బాధ్యతను మేఘా సంస్థకు అప్పగించింది. దీంతో మేఘా ఆఘమేఘాల మీద నిర్మాణ పనులు చేపడుతోంది. రికార్డు సమయంలో ప్రాజెక్టును నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తోంది.
 
పోలవరం ప్రాజెక్టుపై జగన్‌ ప్రత్యేక దృష్టి 
జగన్‌ పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిర్దేశిత సమయంలోపు పనులు పూర్తి చేయాలని మేఘాను ఆదేశించారు. దీంతో రేయింబవళ్లు పనులు జరుగుతున్నాయి. 3.07 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పనిని ఈ యేడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని మేఘా లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా సిబ్బంది, మెటీరియల్‌ను సిద్ధం చేసుకుంది.

రోజుకు ఐదువేలకుపైగా కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు. 2021 ఏప్రిల్‌ నాటికి పోలవరం స్పిల్‌వే, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫీల్‌ డ్యామ్‌ను పూర్తి చేసేలా ప్రభుత్వం, మేఘా సంస్థలు ప్రణాళికలు వేసుకున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే లోనే 53వ బ్లాక్‌ నిర్మాణం కీలకం. ఈ పనిని గడువులోగా పూర్తి చేసేందుకు మేఘా పనులు చేపట్టింది.

ప్రాజెక్టు పూర్తికి మరో 14 నెలల సమయం
స్పిల్ వే కాంక్రీట్ పని పూర్తిచేయడానికి జూన్ వరకూ సమయం పట్టే అవకాశం ఉంది. దీనిలో భాగమైన భీమ్‌లు అంతకన్నా ముందే మే నెలాఖరు నాటికి పూర్తిచేసే యోచనలో ఉన్నారు. స్పిల్‌వేకు సంబంధించిన బ్రిడ్జి పనులు పూర్తి చేయడానికి ఏడునెలల సమయం పట్టే అవకాశం ఉంది. స్పిల్‌వే చానల్‌కు సంబంధించన బ్రిడ్జి పనులు 2021 మే నాటికి పూర్తిచేయబోతున్నారు. ప్రాజెక్టు మొత్తం పనికి ఇంకా 14 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.