Special Status : ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రత్యేక హోదా గురించి విజ్ఞప్తి చేస్తున్నా..అడగటం తప్ప చేయగలిగేది ఏమీ లేదు

ఏపీకి ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర ప్రభుత్వానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నానని..కానీ కేంద్రాన్ని అడగటం తప్ప ఇంక చేయగలిగింది ఏమీ లేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

Special Status : ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రత్యేక హోదా గురించి విజ్ఞప్తి చేస్తున్నా..అడగటం తప్ప చేయగలిగేది ఏమీ లేదు

Cm Jagan Key Comments About Ap Special Status

CM Jagan key Comments : ఏపీకి ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర ప్రభుత్వానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నానని..మనం కేంద్రాన్ని అడగటం తప్ప ఇంక చేయగలిగింది ఏమీ లేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరం అని తెలిపామని..మీరు చేసిన వాగ్ధానం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలాసార్లు విజ్ఞప్తి చేశానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గాని ఇంకా ఏమన్నా చేయాలంటే చేయవచ్చు.. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది..సంకీర్ణ ప్రభుత్వం అయి ఉంటే ఆలోచించవచ్చు కానీ పూర్తి మెజారిటీ ఉన్నాగానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మిన్నకుండిపోతోందని 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్ ఈ విషయాలను వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీకి ప్రత్యేక హోదా గురించి పదే పదే అడగటం తప్ప చేసేది ఇంక ఏమీ లేదని తేల్చి చెప్పాసారు సీఎం జగన్. ఒకటికి పదిసార్లుమనం కేంద్రాన్ని అడగటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పరిస్ధితులు మారతాయనే నమ్మకముందని..నమ్మకంతోనే ముందుకు సాగాలని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తు వస్తున్నామని ఈ కరోనా సమయంలో కూడా ఎటువంటి పథకాలు ఆపకుండా కొనసాగిస్తున్నామని ఏపీకి ఇటువంటి పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నామని అన్నారు.

కాగా..2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్ ప్రకటించాం. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయని తెలిపారు. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని..ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు కానీ ఏపీలో మా ప్రభుత్వంలో అదిసాధ్యమైందని అన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.50లక్షలకు పైగా నిరుద్యోగులను భాగస్వామ్యం చేశఆమని..ఏపీలో ఇప్పటివరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

అలాగే..
దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. మినిమమ్‌ టైం స్కేల్‌తో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు పెంచాం. 51,387 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించామని వెల్లడించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాం. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. గత ప్రభుత్వం మాటలతో భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలుసు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.