CM Jagan : కరోనా కష్టకాలంలో పేదలకు సీఎం జగన్ ఆపన్నహస్తం, 2 నెలలు ఉచితం

కరోనా కష్టకాలంలో ఏపీ సీఎం జగన్ పేదలకు అండగా నిలిచారు. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న వారికి ఆపన్న హస్తం అందించారు. రేషన్‌ కార్డు(అన్ని రకాలు) ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారులకు 2 నెలల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

CM Jagan : కరోనా కష్టకాలంలో పేదలకు సీఎం జగన్ ఆపన్నహస్తం, 2 నెలలు ఉచితం

Cm Jagan Rice

CM Jagan Key Decision : కరోనా కష్టకాలంలో ఏపీ సీఎం జగన్ పేదలకు అండగా నిలిచారు. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న వారికి ఆపన్న హస్తం అందించారు. రేషన్‌ కార్డు(అన్ని రకాలు) ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారులకు 2 నెలల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున అన్ని రకాల రేషన్ కార్డులకూ ఉచితంగానే బియ్యం ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 1.47 కోట్ల కార్డులకు కేంద్రం ఇచ్చే 5 కిలోలు, రాష్ట్రం ఇచ్చే 5 కిలోలు కలిపి ఒకేసారి ఒక్కో వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామన్నారు. అలాగే సాధారణ రకం బియ్యం బదులుగా అదనపు ఖర్చుతో సార్టెక్స్‌ చేసి నాణ్యత పెంచిన స్వర్ణరకం మధ్యస్థ సన్నబియ్యంను డోర్‌ డెలివరీ విధానంలో పంపిణీ చేస్తామన్నారు. రెండు నెలల ఉచిత బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.764 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో 88 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ లబ్ధి అందని 59 లక్షల కార్డు దారులకు మే, జూన్‌ నెలలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని సీఎం జగన్ డెసిషన్ తీసుకున్నారు. అంటే, కేంద్రం ఇచ్చే 5 కేజీల బియ్యానికి అదనంగా మరో 5 కేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. రేషన్‌ వాహనాల ద్వారానే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.