Minister Buggana : దివంగత మంత్రి గౌతమ్ నిర్వహించిన శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయింపు

గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలు మంత్రి బుగ్గనకు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Minister Buggana : దివంగత మంత్రి గౌతమ్ నిర్వహించిన శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయింపు

Buggana

Minister Buggana Rajendranath : ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖలు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయించారు. గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలు మంత్రి బుగ్గనకు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం(మార్చి14, 2022) ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్‌ ఇచ్చారు.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్య పన్నుల శాఖలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటితోపాటు అదనంగా మేకపాటి గౌతమ్ నిర్వహించిన ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలను కూడా బుగ్గనకు అప్పగిస్తూ గవర్నర్‌‌కు సీఎం ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ నోటిఫికేషన్‌ ఇచ్చారు.

AP Assembly Budget Session: గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగం

ఇటీవలే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలసిందే. దుబాయ్ లో జరిగిన పెట్టుబడుల సదస్సుకు హాజరైన మంత్రి.. తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

మరోవైపు మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.. సీఎం జగన్ ను కోరారు. అందుకోసం తమ కుటుంబానికి చెందిన రూ.225 కోట్లు విలువ చేసే మెరిట్స్ కాలేజీ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తామని సీఎం జగన్ ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు.