CM Jagan : వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్.. సీఎం జగన్ కీలక సమావేశం

ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎవరి భవిష్యత్తు ఏంటి అనే దానిపై జగన్ క్లారిటీ ఇచ్చేస్తారని.. (CM Jagan)

CM Jagan : వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్.. సీఎం జగన్ కీలక సమావేశం

CM Jagan : ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 13న చివరిసారిగా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఆ తర్వాట పార్టీలో కీలక మార్పులు జరిగాయి. ఇక, ఏప్రిల్ లో జరిగే సమావేశం ద్వారా నేతల పనితీరుపై సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

దీంతో ఈసారి సమావేశంలో ఎవరి భవిష్యత్తు ఏంటి అనే దానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల పనితీరుపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు పార్టీ నేతలు.(CM Jagan)

Also Read..Razole: ఏపీ పాలిటిక్స్‌లో హీట్ రేపుతోన్న రాజోలు రాజకీయం.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..

ఇక ఈ నెల 18 నుంచి 26వరకు జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో వచ్చే నెల రెండో వారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. దీన్ని ఎలా నిర్వహించాలి అనే దానిపై కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.

Also Read..Atchannaidu : ఆ నలుగురే కాదు.. 40మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ ద్వారా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అందించిన పాలన, అభివృద్ధి, సంక్షేమం, పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించేలా ప్రభుత్వం ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుమారు 8వేల సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఇక మిగిలిన సచివాలయాల్లో కూడా త్వరితగతిన కార్యక్రమం పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.(CM Jagan)

Also Read..Nara Lokesh : వైఎస్ జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరిన నారా లోకేశ్.. జగన్ ఎలా స్పందిస్తారో..

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి ఊహించని ఫలితాలు ఎదురవడంతో ఈసారి సమావేశం హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పనితీరు మార్చుకోని మంత్రులను కొంతమందిని మార్చేస్తానని పలుమార్లు హెచ్చరించారు సీఎం జగన్. నివేదికల ఆధారంగా ఎలాంటి కీలక ప్రకటన చేస్తారోనని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి సోమవారం జరిగే సమావేశంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.(CM Jagan)