CM Jagan : మాస్క్ లేకపోతే జరిమానా.. అవన్నీ మూసేయాల్సిందే… సీఎం జగన్ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మాస్క్‌ ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధించాలన్నారు. మాస్క్ లేకపోతే రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. కొవిడ్‌ పరిస్థితులపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

CM Jagan : మాస్క్ లేకపోతే జరిమానా.. అవన్నీ మూసేయాల్సిందే… సీఎం జగన్ కీలక ఆదేశాలు

Cm Jagan Action Plan For Corona Control In Ap

CM Jagan Corona Control Orders : రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మాస్క్‌ ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. కొవిడ్‌ పరిస్థితులపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతుల వరకు సెలవులు ప్రకటించాలన్నారు. అలాగే హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్లు సైతం మూసివేయాలని ఆదేశించారు. ఫంక్షన్‌ హాళ్లలో రెండు కుర్చీల మధ్య ఆరు అడుగుల దూరం.. థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

* రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
* కరోనా నియంత్రణ చర్యలపై చర్చించేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రతి రోజూ భేటీ కావాలి
* లాక్ డౌన్ విధించడం కంటే, కట్టడి చర్యలపై దృష్టి పెట్టాలి
* కన్వెన్షన్ సెంటర్స్ లో జరిగే ఫంక్షన్లలో రెండు కుర్చీల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి
* సినిమా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఓ సీటు ఖాళీగా ఉంచాలి
* అన్ని ఆసుపత్రుల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండాలి
* అసవరం అయితే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి
* వ్యాసార సంస్థలు కొవిడ్ నిబంధనలు పాటించాలి
* మాస్కు, శానిటైజర్ తప్పనిసరి
* బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకపోతే రూ.100 ఫైన్