CM Jagan : ఏపీ సేవా పోర్టల్ ను ప్రారంభించిన సీఎం జగన్

గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో రెండేళ్లుగా అమలు చేసి చూపించామని సీఎం జగన్ తెలిపారు. దరఖాస్తులపై భౌతికంగా సంతకం చేయడం ద్వారా ఉద్యోగులకు బాధ్యత పెరుగుతుందన్నారు.

CM Jagan : ఏపీ సేవా పోర్టల్ ను ప్రారంభించిన సీఎం జగన్

Ap Mee Sava Portel

CM Jagan launched AP service portal : సిటిజన్ సర్వీస్ పోర్టల్ ను సీఎం జగన్ ప్రారంభించారు. సిటిజన్ సర్వీస్ పోర్టల్ కు ఏపీ సేవా పోర్టల్ గా పేరు పెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా మరింత వేగంగా సేవలు అందనున్నట్లు పేర్కొన్నారు. సామాన్యులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకే ఏపీ సేవా పోర్టల్ 2.0 ప్రారంభిస్తున్నామని చెప్పారు. గ్రామ స్వరాజ్యానికి ఈ పాలనకు మించిన ఉదాహరణ లేదన్నారు.

గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో రెండేళ్లుగా అమలు చేసి చూపించామని తెలిపారు. దరఖాస్తులపై భౌతికంగా సంతకం చేయడం ద్వారా ఉద్యోగులకు బాధ్యత పెరుగుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540కి పైగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.34 లక్షల మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

Kanipakam Temple : కాణిపాకం ఆలయ సమీపంలో దారుణం.. పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు

2.60 లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. మారుమూల గ్రామాలకు కూడా మరింత వేగంగా సేలు అందుతాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. దరఖాస్తుల పరిష్కారం ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుస్తుందని తెలిపారు.

ఎస్ఎంఎస్ ల ద్వారా అప్లికేషన్ల ప్రాసెసింగ్ సమాచారం అందుతుందన్నారు. ఏపీ సేవా పోర్టల్ ద్వారా రుసుము చెల్లించే వెసులుబాటు ఉందని తెలిపారు. ఆన్ లైన్ లోనే దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుందని తెలిపారు. గ్రామ స్వరాజ్యానికి ఇదే నిదర్శనమని అన్నారు.