YSR Kalyanamasthu Shaadi Tohfa : వారికి 1.50 లక్షలు.. ఏపీలో మరో రెండు కొత్త పథకాలు.. రేపటి నుంచే అమలు

తాజాగా సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించారు సీఎం జగన్. అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

YSR Kalyanamasthu Shaadi Tohfa : వారికి 1.50 లక్షలు.. ఏపీలో మరో రెండు కొత్త పథకాలు.. రేపటి నుంచే అమలు

YSR Kalyanamasthu Shaadi Tohfa : ఏపీ సీఎం జగన్ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వీటి ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. పలు పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించారు సీఎం జగన్. అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు’, ‘షాదీ తోఫా’ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ పథకాలకు సంబంధించిన వెబ్‌సైట్లను లాంఛనంగా ప్రారంభించారు. అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాలు అమల్లోకి రానున్నాయి.

పేదింటి ఆడపిల్లల పెళ్లి సందర్భంగా ఈ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు లక్ష, బీసీలకు 50 వేలు, షాదీ తోఫాలో ముస్లిం, మైనార్టీలకు లక్ష, వికలాంగుల వివాహానికి 1.5 లక్షలు అందించనున్నారు. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకాల ద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేశామని నేతలు వెల్లడించారు.

కులాంతర వివాహం చేసుకున్న వారికి లక్షా 20 వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. దివ్యాంగులకు ఈ పథకం కింద రూ.1.5 లక్షలు ప్రోత్సాహకంగా అందించనున్నారు. అయితే, ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకం పొందేందుకు వధూవరులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. అమ్మాయి వయసు 18 ఏళ్లు నిండాలి.. అబ్బాయికి 21 ఏళ్లు నిండాలి. గ్రామాల్లో ఆదాయం నెలకు 10 వేలు పట్టణాల్లో అయితే నెలకు 12 వేలకు మించకూడదు. వారి ఇళ్ళలో నెలవారి విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటకూడదు. అలాగే కుటుంబంలో ఇన్ కమ్ టాక్స్ పేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు.

బాల్య వివాహాల నివారణ, చదువులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని చదువులతో కనెక్ట్ చేసినట్లు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవసరమైతే వాలంటీర్ల సాయం తీసుకోవచ్చునని వెల్లడించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వర్తించనుంది. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వధూవరులకు లక్ష, ఒకవేళ వీరు కులాంతర వివాహం చేసుకుంటే 1.20 లక్షలు ఇస్తారు. బీసీలకు 50 వేలు, వీరు కులాంతర వివాహం చేసుకుంటే 75 వేల ఆర్థిక సాయం ఉంటుంది. మైనార్టీలకు లక్ష, దివ్యాంగులైతే 1.50 లక్షలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులకు 40 వేలు ప్రభుత్వం సాయం చేస్తుంది.