CM Jagan : రూ.400కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు సీఎం జగన్ శంకుస్థాప‌న‌

ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 400 కోట్ల రూపాయ‌ల‌తో

CM Jagan : రూ.400కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు సీఎం జగన్ శంకుస్థాప‌న‌

ap cm jagan : ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 400 కోట్ల రూపాయ‌ల‌తో ఈ పనులు చేయ‌నున్నారు. ఎర్రముక్కపల్లెలోని సీపీ బ్రౌన్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు చేరుకుని బ్రౌన్‌ విగ్రహాన్ని జగన్ ఆవిష్క‌రిస్తారు. అలాగే, బ్రౌన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ త‌ర్వాత‌ కలెక్టరేట్‌ సమీపంలోని మహావీర్‌ సర్కిల్‌ దగ్గర శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనుల‌ను ప్రారంభిస్తారు. వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియం దగ్గర కూడా ప‌లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ‌నున్నారు. అలాగే, వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల విగ్రహాలను ఆయ‌న ఆవిష్క‌రిస్తారు.

రాష్ట్రంలోనే వెనుకబాటులో ఉన్న నియోజకవర్గం బద్వేల్ అని, గత పాలకులు బద్వేలు నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని సీఎం జగన్ అన్నారు. బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు చేపడతామన్నారు. బ్రహ్మ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్ళు ఎప్పుడూ నిండు కుండలా ఉండాలని ఆకాంక్షించారు. కుందూ నది పై లిఫ్ట్ ద్వారా బ్రహ్మ సాగర్ కు నీళ్లు అందిస్తామని సీఎం వెల్లడించారు.

రూ.36 కోట్లతో బ్రహ్మ సాగర్ ఎడమ కాలువలో ఎత్తిపోతలకు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. రూ.80 కోట్లతో లోయర్ సగిలేరు కాలువల విస్తరణ పనులు చేపడుతున్నామని బ్రాహ్మణ పల్లి దగ్గర సగిలేరు పై రూ.9.5 కోట్లతో మరో వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ చెప్పారు. రూ.7.5 కోట్ల తో గోదాముల నిర్మాణంతో పాటుగా బద్వేలులో నూతన ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు.