CM Jagan : అపాచీ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన | CM Jagan lays foundation stone and Pylon unveiled for footwear company Apache in Srikalahasti Zone, Inagaluru, Tirupati

CM Jagan : అపాచీ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీ మండలం ఇనగలూరులో పాదరక్షల కంపెనీ అపాచీకి సీఎం జగన్ శంకుస్థాపన చేసి...ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరించారు. మొదటి దశలో 350 కోట్లు, మరో ఐదేళ్లలో మరో 350 కోట్లు వెచ్చించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

CM Jagan : అపాచీ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన

CM Jagan Apache : అపాచీ కంపెనీ యూనిట్ స్థాపనతో 80శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కుతాయని సీఎం జగన్ అన్నారు. అలాగే 10 వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. 8 వందల కోట్లతో అపాచీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. కంపెనీకి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీ మండలం ఇనగలూరులో పాదరక్షల కంపెనీ అపాచీకి సీఎం జగన్ శంకుస్థాపన చేసి…ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరించారు. మొదటి దశలో 350 కోట్లు, మరో ఐదేళ్లలో మరో 350 కోట్లు వెచ్చించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్. వచ్చే ఏడాది సెప్టెంబర్ కల్లా అపాచీ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధం కానుంది.

మరోవైపు 3 వేల 644 కోట్ల రూపాయలతో 8 పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో 12 వందల 30 కోట్ల రూపాయలతో ఏర్పాటవుతున్న టిసిఎల్ కంపెనీకి భూమి పూజ చేశారు. 125 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ ఏర్పాటవుతోంది. ఈ సంస్థ ద్వారా మూడు వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. ఇక రేణిగుంట విమానాశ్రయం సమీపంలో మరో ఆరు పరిశ్రమల ఏర్పాటు శంకుస్థాపన చేశారు.

CM Jagan: వకులమాత ఆలయానికి సీఎం జగన్.. పలు కార్యక్రమాల శంకుస్థాపన

అంతకుముందు సీఎం జగన్ తిరుపతి పేరూరులో వెలసిన వకుళమాత ఆలయ పునః ప్రారంభంలో పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ, మహా సంప్రోక్షణం క్రతువు చేపట్టారు. వందల ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న వకుళ మాత ఆలయం..హైదర్ అలీ దండయాత్రలో ధ్వంసమైంది. అయితే సొంత నిధులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ఈ ఆలయం పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొని పూజలు చేశారు.

×