సీఎం మీతో ఉన్నాడు, దూకుడుగానే ఉండండి… ఇసుక, మద్యం అక్రమ రవాణపై ఉక్కుపాదం

ఏపీలో ఇసుక, మద్యం అక్రమరవాణపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో బయట రాష్ట్రాల

  • Published By: naveen ,Published On : June 9, 2020 / 11:38 AM IST
సీఎం మీతో ఉన్నాడు, దూకుడుగానే ఉండండి… ఇసుక, మద్యం అక్రమ రవాణపై ఉక్కుపాదం

ఏపీలో ఇసుక, మద్యం అక్రమరవాణపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో బయట రాష్ట్రాల

ఏపీలో ఇసుక, మద్యం అక్రమరవాణపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో బయట రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణ జరక్కూడదన్నారు. వీటిపై ఉక్కుపాదం మోపితేనే మంచి భవిష్యత్తును తర్వాత తరాలకు అందించగలుగుతాం అన్నారు. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరున్నా ఉపేక్షించవద్దని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. సీఎం మీతో ఉన్నాడు, దూకుడుగానే ఉండండి అంటూ జగన్ అధికారులకు ధైర్యం చెప్పారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ మంగళవారం(జూన్ 9,2020) అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధంపై చర్చించారు.

* లిక్కర్‌ వినియోగం తగ్గించడానికి అన్నిరకాల చర్యలూ తీసుకున్నాం
* 43వేల బెల్టు షాపులు ఎత్తివేశాం
* 33శాతం మద్యం దుకాణాలు తగ్గించాం
* మద్యం విక్రయాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేస్తున్నాం
* విక్రయించే వేళలను బాగా తగ్గించాం
* పద్దతి ప్రకారం మద్య నియంత్రణ చేస్తున్నాం
* షాక్‌ కొట్టే రీతిలో రేట్లు పెంచాం
* ఇవన్నీ చేస్తున్నప్పుడు.. మద్యం అక్రమ రవాణా, తయారీ జరక్కుండా చూడాలి
* బయట రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరక్కూడదు
* వీటిపై ఉక్కుపాదం మోపితేనే మంచి భవిష్యత్తును తర్వాత తరాలకు అందించగలుగుతాం
* కుటుంబాల్లో ప్రేమ, అనురాగాలను నింపగలుగుతాం
* మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించవద్దు

Read: ఉచితంగా ఇసుక, సీఎం జగన్ గుడ్ న్యూస్