CM Jagan : బాబుని అసెంబ్లీకి తీసుకురండి.. ఆయన మొహం చూడాలి – జగన్

గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది.

CM Jagan : బాబుని అసెంబ్లీకి తీసుకురండి.. ఆయన మొహం చూడాలి – జగన్

Cm Jagan

CM Jagan :  గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ప్రస్తావనకు వచ్చింది. సభకు చంద్రబాబును తీసుకురండి కుప్పం ఫలితాల తర్వాత ఆయన మొహం చూడాలని ఉందని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడుని సభకు తీసుకురావాలని టీడీపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడిని ఒకటి రెండు సార్లు కోరారు సీఎం జగన్. కుప్పం గురించి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు.

చదవండి : Kuppam: కుప్పం కోటపై ఎగిరిన వైసీపీ జెండా

ఇక ఇదే సమయంలో అచ్చెం నాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తెలిపారు. బీఏసీలో ఎన్నికల ప్రస్తావన ఎందుకు.. మీరు ఎలా గెలిచారో అందరికి తెలుసనీ అచ్చన్న వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ అచ్చెం నాయుడు ఇంఛార్జిగా ఉన్న నెల్లూరు మున్సిపాలిటీలో ఆ పార్టీ ఒక్కసీటు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. ఇక ఇదే సమయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.

చదవండి : CM Jagan : సీఎం జగన్ సీరియస్.. మురికి కాల్వల వెంట అధికారుల పరుగులు

ఇదిలా ఉంటే మొదట ఒక్క రోజు మాత్రమే సభ నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు. కానీ పాస్ కావాల్సిన బిల్లులు చాలా ఉండటంతో సభ 15 రోజులు కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 26 వరకు సభ జరుపుకుందామన్నారు జగన్. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షం సహకరించాలని కోరారు. అర్ధమైన చర్చలు జరిగేలా చూడాలని సూచించారు జగన్. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారు మంత్రులు. ఎమ్మెల్సీ ఎన్నికలకు లిమిటెడుగా ఎమ్మెల్యేలు వెళ్తే సరిపోతుందన్నారు సీఎం జగన్.