CM Jagan-Amit Shah : అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. మూడు రాజధానులపై చర్చ..

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటి అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఆయన అమిత్ షాతో చర్చించారు. 

CM Jagan-Amit Shah : అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. మూడు రాజధానులపై చర్చ..

Cm Jagan Amit Shah

CM Jagan Meet Amit Shah : ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటి అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఆయన అమిత్ షాతో చర్చించారు.

అందులో ప్రధానంగా ఏపీలో మూడు రాజధానులపై జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. పరిపాలనా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన హామీలు, పెండింగ్ నిధులు విడుదల చేయాలని జగన్ అమిత్ షాను కోరినట్టు తెలిసింది. రాజకీయ పరిణామాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కేంద్రమంత్రుల్లో ప్రకాశ్ జవదేకర్, గజేంద్ర సింగ్ షెకావత్‌, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌ లతో భేటీ అయిన సీఎం జగన్.. పర్యావరణ అనుమతులు, పోలవరం ప్రాజెక్టు బిల్లులు, విశాఖ స్టీల్ ప్లాంట్, 3 రాజధానుల వ్యవహారంపై చర్చించారు. పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను సీఎం వివరించారు.

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ వెంట చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బలశౌరి, వేమూరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భారత్, గురుమూర్తి, మోపిదేవి వెంకటరమణ,ఎం వివి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.