24 గంటల్లోగా కోవిడ్‌ పరీక్షల ఫలితాలు, అధికారులకు సీఎం జగన్ ఆదేశం

  • Published By: naveen ,Published On : August 25, 2020 / 01:18 PM IST
24 గంటల్లోగా కోవిడ్‌ పరీక్షల ఫలితాలు, అధికారులకు సీఎం జగన్ ఆదేశం

ఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి రికార్డు నెలకొల్పామన్నారు. క్లస్టర్లలో ఉద్ధృతంగా పరీక్షలు చేసి.. కోవిడ్‌ సోకిన వారిని గుర్తిస్తే రిస్కు ఉన్న వారి ప్రాణాలు కాపాడుకోగలుగుతామన్నారు. కోవిడ్‌ సోకిన విషయాన్ని వీలైనంత త్వరగా గుర్తించగలిగితే.. చిన్న చిన్న మందులతోనే ఇంట్లోనే కోలుకునే అవకాశం ఉంటుందన్నారు సీఎం జగన్. వీలైనంత త్వరగా కోవిడ్‌ సోకిన వారిని గుర్తించే దిశగానే పరీక్షలు ఉద్ధృతంగా చేస్తున్నామన్నారు. 24 గంటల్లోగా కోవిడ్‌ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని, దీనిపై దృష్టి పెట్టాలని అధికారులతో చెప్పారు సీఎం జగన్.



సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ సంక్షోభంపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. వారి బాధ్యతలు ఏంటో తెలిపారు. కరోనా వైద్యం, ఆసుపత్రులు, ఫీజులు తదితర అంశాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

* కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి:
* వేచి చూసే పరిస్థితులు లేకుండా అరగంటలో కచ్చితంగా బెడ్‌ ఇవ్వాలి
* నాకు బెడ్‌ దొరకలేదనే మాట ఎక్కడా వినిపించకూడదు
* అరగంటలోగా బెడ్‌ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే
* 104 కాల్‌ సెంటర్‌ సహా, 14410 తదితర కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్‌కాల్స్‌కు సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
* దీనిపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి, గట్టిగా ధ్యాస పెట్టాలి
* కాల్‌ సెంటర్లకు వచ్చే కాల్స్‌కు కచ్చితంగా స్పందిచి పరిష్కరించాలి
* ఆస్పత్రుల్లో ఉన్న హెల్ప్‌ డెస్క్‌లు మీకు కళ్లు, చెవులుగా భావించండి
* కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఉన్న హెల్ప్‌ డెస్క్‌లు బాగా పనిచేసేలా చూడండి
* కోవిడ్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది, ఆహారం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్‌ లైన్లు, మందులు తదితర అంశాలు సరిగ్గా ఉన్నాయో? లేవా? అన్నది చూడండి


* వీటిని పరిగణలోకి తీసుకుని రేటింగ్‌ ఇవ్వండి
* ఈ 6 అంశాల్లో కచ్చితంగా ప్రమాణాలు పాటించేలా చూడండి
* కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలు నాణ్యంగా ఉండాలి
* సీసీ కెమెరాల ద్వారా కోవిడ్‌ ఆస్పత్రులను పర్యవేక్షించాలి
* అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు పెట్టాలి
* వార్డుల్లో కార్యకలాపాను సీసీ కెమెరాల ద్వారా మానిటర్‌ చేయాలి
* అలాగే కోవిడ్‌ వచ్చిందని భావిస్తే.. ఏం చేయాలి? ఎవరికి కాల్‌ చేయాలి? అన్నదానిపై అవగాహన కలిగించాలి
* ఈ రెండు అంశాల మీద అవగాహన లేని మనిషి రాష్ట్రంలో ఉండకూడదు
* గ్రామ, వార్డు సచివాలయాలు సహా ప్రతిచోటా దీనికి సంబంధించిన హోర్డింగ్స్‌ను పెట్టండి



* కొన్ని కొన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స కోసం ఎక్కువగా ఛార్జ్‌ చేస్తున్నారు
* ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దానికంటే.. ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయి
* దీనిపై కలెక్టర్లు, పోలీసులు దృష్టి పెట్టాలి
* కోవిడ్‌ వచ్చిన సమయాల్లో మానవత్వం చూపించాలని ప్రజలు ఆశిస్తారు
* కాని ఇలాంటి మహమ్మారి వచ్చిన సమయంలో మానవత్వం చూపించకుండా అధికంగా డబ్బు వసూలు చేసే సంస్కృతి ఉన్న ఆస్పత్రులపై దృష్టిపెట్టాలి
* అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోండి

* మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి.. ఆస్పత్రులు ఉన్న చోట అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? లేదా? పరిశీలించండి
* భద్రతాపరంగా పెట్టాల్సిన పరికరాలు పెట్టి.. తర్వాత మళ్లీ ఆస్పత్రులు మొదలుపెట్టండి అని చెప్పండి
* ప్రాణాలు పోకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి:
* ఒక ఘటన జరిగినప్పుడు మనం పాఠాలు నేర్చుకోవాలి
* మండల స్థాయిలో ఒక కమిటీని పెట్టి… 3-5 మంది సభ్యులను పెట్టి, కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో భద్రతా నియమాలు పాటిస్తున్నారా? లేదా? అని చూడండి
* కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నారా? లేదా? అని చూడండి
* కనీసం అగ్నిప్రమాదాన్ని నిరోధించే సిలెండర్లు ఉన్నాయా? లేదా? చూడండి
* లేకపోతే కొంత సమయం ఇచ్చి… మళ్లీ తెరిచేందుకు చూడండి
* ప్రాణాలు కాపాడే కనీస జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాలు ఉండేలా చూడండి



ఆరోగ్య శ్రీ:
* మన దగ్గరున్న పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో… ప్రతిచోటా ఒక హెల్ప్‌ డెస్క్‌ క్రియేట్‌ చేయండి
* అక్కడ ఆరోగ్య మిత్రలను కూర్చోబెట్టండి
* ఒక ఆరోగ్య శ్రీ పేషెంట్‌ కాని వస్తే.. వారిని మానవత్వంతో డీల్‌ చేయాలి
* ఒక పేషెంట్‌ను వైద్యం చేసే పరిస్థితి అక్కడ లేకపోతే.. వారు ఎక్కడకు వెళ్లాల్సి అన్నది వారికి దిక్సూచిలా వ్యవహరించాలి
* మా దగ్గర ఈ సదుపాయాలు లేవు… వెళ్లిపోండి అన్నట్టుగా ఉండకూడదు
* పలానా చోటకు వెళ్లాలి? నేను అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తాను.. అన్నరీతిలో ఉంటే.. పేషెంట్‌కు ఊరట లభిస్తుంది



ఆరోగ్యశ్రీ రిఫరెల్‌ వ్యవస్థ ఇలా ఉండాలి:
* ఎక్కడ వైద్యం లభిస్తుందో ఫోన్‌ చేసి, అరేంజ్‌ చేసి… పేషెంట్‌కు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలి
* అంతేకాక ఆరోగ్య ఆసరా పథకం కూడా బలంగా అమలు కావాలి
* పేషెంట్లు విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు రూ.225లు, లేదా నెలకు రూ.5వేలు ఇవ్వాలన్నది మన స్కీం
* పేషెంట్‌ ఆస్పత్రినుంచి బయటకు వస్తున్న సమయంలో ఆరోగ్య ఆసరా అందాలి
* ఈ రెండు మార్పులు మనం తీసుకు వచ్చినప్పుడు మాత్రమే.. మనం రెండు అడుగులు ముందుకు వేసినట్టు
* జేసీలు దీనిపై దృష్టి పెట్టాలి
* కోవిడ్‌ కోసం తాత్కాలికంగా మనం చేస్తున్న డాక్టర్లు, నర్సుల నియామకాలపై దృష్టిపెట్టాలి
* కోవిడ్‌ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని పెట్టాలి