Nellore : గౌతమ్ రెడ్డి సంతాప సభ.. భావోద్వేగానికి గురైన సీఎం జగన్

తనను కూడా అతను ప్రేరేపించేవాడని, అలాంటి మంచి వ్యక్తిని పొగొట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి తాను తీసుకొచ్చినట్లు, మంచి రాజకీయాలు చేశాడని కొనియాడారు...

Nellore : గౌతమ్ రెడ్డి సంతాప సభ.. భావోద్వేగానికి గురైన సీఎం జగన్

Mekapati

Mekapat Goutham Reddy Nellore : మేకపాటి గౌతమ్ రెడ్డిని కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నట్లు, తాను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానని సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. గౌతమ్ లేని లోటు తీర్చలేదని, అతని కుటుంబానికి తాను, వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. మే 15లోపు సంగం బ్యారేజీ పనులు పూర్తవుతాయని మంత్రి అనీల్ చెబుతున్నారని, మంచి రోజు చూసుకుని.. తాను స్వయంగా ఇక్కడకు వచ్చి ప్రాజెక్టు ప్రారంభిస్తానన్నారు. ఆయన జ్ఞాపకార్థం మేకపాటి గౌతమ్ సంగం పేరు పెడుతామని ప్రకటించారు. నెల్లూరులో జరిగిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప జరిగింది. ఈ సభలో పాల్గొన్న సీఎం జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళలర్పించారు.

Read More : Mekapati Goutham Reddy : ముగిసిన గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు.. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు

అనంతరం జరిగిన సంతాప సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… తనను కూడా అతను ప్రేరేపించేవాడని, అలాంటి మంచి వ్యక్తిని పొగొట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి తాను తీసుకొచ్చినట్లు, మంచి రాజకీయాలు చేశాడని కొనియాడారు. దాదాపు ఆరు శాఖలను నిర్వహించి.. మంచి మంత్రిగా కొనసాగడన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని, మంత్రివర్గంలో కొనసాగాడన్నారు. ఏపీకి పరిశ్రమలు తీసుకరావాలని.. ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి తాపత్రయే వాడన్నారు. అదే క్రమంలో.. దుబాయ్ కి వెళ్లాడని.. వెళ్లి వచ్చిన అనంతరం తనను కలవాలని అనుకున్నాడన్నారు.

Read More : Mekapati Goutham Reddy: నెల్లూరులోనే మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి అంత్యక్రియలు

ఆ కుటుంబానికి తానే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని తెలిపారు. ఆయన జ్ఞాపకార్థం.. ప్రభుత్వ పరంగా కాలేజీని తీసుకోవడం, అగ్రికల్చర్, హార్టికల్చర్ మార్చడమే కాకుండా.. అవకాశం ఉంటే యూనివర్సిటీ మారుస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ 2లో ఉన్న ఉదయగిరి, బద్వేల్ ప్రాంతాలను ఫేజ్ 1లోకి తీసుకొస్తే ఆత్మకూరు, ఉదయగిరి రెండు నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని.. ఇవి చేయడం వల్ల గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని ఆ కుటుంబం చెప్పడం జరిగిందన్నారు. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని సీఎం జగన్ వెల్లడించారు.

Read More : Mekapati Goutham Reddy: దుబాయ్‌లోనే ఇబ్బంది పడ్డట్టుగా గౌతమ్‌రెడ్డి కదలికలు..!

1971లో మేకపాటి గౌతమ్ రెడ్డి జన్మించారు. నెల్లూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లో రెండుసార్లు ఆత్మకూరు నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి పనిచేస్తున్నారు.