సీఎం జగన్ ఫొటో కింద పెట్టారని, పంచాయతీ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం తొండవరం గ్రామ పంచాయతీ సిబ్బందిపై గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సీరియస్ అయ్యారు. సీఎం జగన్ చిత్రపటాన్ని నేలపై

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 08:05 AM IST
సీఎం జగన్ ఫొటో కింద పెట్టారని, పంచాయతీ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం తొండవరం గ్రామ పంచాయతీ సిబ్బందిపై గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సీరియస్ అయ్యారు. సీఎం జగన్ చిత్రపటాన్ని నేలపై

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం తొండవరం గ్రామ పంచాయతీ సిబ్బందిపై గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సీరియస్ అయ్యారు. సీఎం జగన్ చిత్రపటాన్ని నేలపై ఉంచడాన్ని ఆయన తప్పు పట్టారు. సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఫొటోతో పాటు వైస్ రాజశేఖర్ రెడ్డి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటోలు విధిగా పంచాయతీ కార్యాలయంలో ఉండాల్సిందేనని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదని సిబ్బందికి హెచ్చరించారు. ఏ గవర్నమెంటు కింద పని చేస్తున్నారు, సీఎం ఎవరు అనే విషయాలు ముందు తెలుసుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే ఊరుకునేది లేదని పంచాయతీ సిబ్బందిపై ఫైర్ అయ్యారు.

ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంచాయతీ సిబ్బంది షాక్ తిన్నారు. ఏం జరిగిందో వారు వివరించే ప్రయత్నం చేసినా.. ఎమ్మెల్యే ఊరుకోలేదు. వారి మాట వినిపించుకోలేదు. సరే సార్ అంటూ పంచాయతీ సిబ్బంది మౌనంగా ఉండిపోయారు. ఎమ్మెల్యే సారు సీరియస్ గా చెబుతున్న మాటలను మౌనంగా నిలబడి ఉన్నారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని ఎమ్మెల్యేతో చెప్పారు.

దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీరుని వారు తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చిత్రపటం కచ్చితంగా ఉండాలనే రూల్ ఎక్కడా లేదన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం అన్నారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఓవరాక్షన్ చేశారని, అనవసరంగా పంచాయతీ సిబ్బందిని తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

See Also | ఏపీలో మోగిన నగారా, స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఇవే..