CM Jagan : డ్రై ఫ్లవర్ టెక్నాలజీ కళాకృతులకు సీఎం జగన్ ఫిదా
డ్రై ఫ్లవర్ టెక్నాలజీ ద్వారా టీటీడీ, డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా వివిధ కళాకృతులతో తయారు చేస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఫోటో ప్రేమ్‌లు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.

CM Jagan : డ్రై ఫ్లవర్ టెక్నాలజీ ద్వారా టీటీడీ, డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా వివిధ కళాకృతులతో తయారు చేస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఫోటో ప్రేమ్‌లు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద ( పేరూరు బండపై ) నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి గురువారం హాజరైన ముఖ్యమంత్రి జగన్ కి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, శ్రీ వకుళమాత ఆకృతితో తయారు చేసిన డ్రైఫ్లవర్ టెక్నాలజీ ఫోటో ఫ్రేమ్‌ను అందించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.
CM Jagan : వైభవంగా వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ, సంప్రదాయ దుస్తుల్లో హాజరైన సీఎం జగన్
డ్రైఫ్లవర్ టెక్నాలజీ కళాకృతులకు విశేష ఆదరణ
టీటీడీలోని వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో డ్రైఫ్లవర్ టెక్నాలజీని ఉపయోగించి శ్రీవారు, అమ్మవార్ల ఫోటో ప్రేమ్‌లు, పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు తదితర ఉత్పత్తులను తయారు చేయడానికి టీటీడీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో గతేడాది సెప్టెంబర్ 13వ తేదీన ఎంవోయు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రూ.83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చుతోంది.
తిరుపతిలోని సిట్రస్ రీసెర్చ్ స్టేషన్‌లో దాదాపు 350 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. రోజూ 200 మంది మహిళలు.. స్వామి, అమ్మవారి ఆకృతులను, వివిధ కళాకృతులను ఏ4 సైజులో తయారు చేస్తున్నారు. ఒక మహిళ రోజుకు రెండు చిత్ర పటాలు తయారు చేయవచ్చు. ఇప్పటివరకు 16వేల 823 ఏ4 సైజు ఫోటో ప్రేమ్‌లు, 530 కీ చైన్లు, 150 పేపర్ వెయిట్లు, మరో 300 బుక్ మార్స్క్, పెండంట్స్, పెన్ హుక్‌లు తయారు చేశారు. త్వరలో సిట్రస్ రీసెర్చ్ స్టేషన్‌లో శాశ్వత షెడ్డు ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
టీటీడీ జనవరి 25వ తేదీ నుండి వీటిని భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచింది. భక్తుల సౌకర్యార్థం తిరుమల, స్థానిక ఆలయాల్లోనూ, దేశంలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది.
- CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేసిన సీఎం జగన్
- CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్
- CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
- Liquor Alipiri : తిరుమలలో మద్యం కలకలం.. 20 మందు బాటిళ్లు స్వాధీనం
- Village ward secretariat employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది.. భారీగా పెరిగిన జీతాలు
1SSMB 29 : ప్యారిస్ ఫేమస్ 3డి యానిమేషన్ స్టూడియోలో రాజమౌళి.. మహేష్ సినిమా కోసమేనా??
2KA Paul: ప్రధానిగా మోదీ ఉండకూడదు.. వారిద్దరిలో ఎవరైనా ఓకే..
3Maharashtra Politics : ముచ్చటగా మూడోసారి సీఎంగా ఫడ్నవీస్..డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే
4Allari Naresh : ఓట్ల కోసం నరేష్ ప్రయాణం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..
5TS 10th Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు విడుదల
6Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
7Philippines President: 36ఏళ్ల క్రితం దేశం నుంచి తన కుటుంబాన్ని వెళ్లగొట్టారు.. ఇప్పుడు అదే దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు..
8Tollywood Heros : టాలీవుడ్ హీరోలని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్.. ట్రోల్స్ తో హడావిడి..
9CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్ ప్రాజెక్ట్ నిర్మించటం వెనుక చైనా లక్ష్యం ఏంటి ?
10N.Chandrababu Naidu: ఆటో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదమన్న లోకేష్
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!