హోదా వస్తుంది : గత ప్రభుత్వం చెప్పినట్టు నేను చెప్పను..ఏం చెప్తామో..అదే చేస్తాం – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 07:02 AM IST
హోదా వస్తుంది : గత ప్రభుత్వం చెప్పినట్టు నేను చెప్పను..ఏం చెప్తామో..అదే చేస్తాం – సీఎం జగన్

‘ప్రత్యేక హోదాను ఏదో ఒక రోజు సిద్ధిస్తుంది..గత ప్రభుత్వం చెప్పినట్లుగా..నేను చెప్పను..ఏది చెబుతామో..అదే చేస్తాం..గత ప్రభుత్వాలు చెప్పినట్లుగా తాను చెప్పను’ అని సీఎం జగన్ వెల్లడించారు. కేంద్రంలో అధికారంలో ఉండేవారు…ఆధారపడే పరిస్థితి వచ్చే రోజులు తెస్తామని స్పష్టం చేశారు. మన పాలన – మీ సూచన పేరిట వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2020, మే 28వ తేదీ గురువారం పరిశ్రమలు – పెట్టుబడులపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.

గత ప్రభుత్వం చెప్పినట్టు తాను మాటలు చెప్పలేనని, 20 లక్షల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అని మాటలు చెప్పలేనన్నారు. ఎయిర్ బస్ వస్తుందని, మైక్రోసాఫ్ట్ వస్తుందని, హైపర్ లూప్ వస్తుందని, దివాలా తీసిన బీఆర్ షెట్టి రూ.6వేల కోట్లు పెడుతానని… గ్రాఫిక్స్ చూపించలేనన్నారు. ఎవరికీ అన్యాయం చేయనని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని గతంలో చెప్పేవారనే విషయాన్ని గుర్తు చేశారాయన. కానీ, 2014 నుంచి 2019 వరకూ పరిశ్రమలకు ఇన్సెంటివ్ లు ఇవ్వలేదన్నారు. రూ. 4 వేల కోట్లు బకాయిలు పెట్టారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

అలాంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ ఒన్ లో ఉన్నామని చెప్పడంలో అర్థం ఏముందని ప్రశ్నించారాయన. డిస్కంలకు గత ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు బకాయిలు పెట్టిందని, ఒక్క రూపాయికూడా చెల్లించలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో బాగున్నామని చెప్పగలమా ? అని నిలదీశారు. అవినీతికి తావులేని పరిపాలనను అందిస్తున్నామని, గతంలో పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలంటే కూడా ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్టచెప్పే పరిస్థితి ఉండేదన్నారు. టెండర్ల ప్రక్షాళనకు జ్యుడిషియల్ ప్రివ్యూ పెట్టడం, రివర్స్ టెండరింగ్ ప్రాసెస్‌ను తీసుకు వచ్చామన్నారు. పరిశ్రమల పట్ల నిజాయితీ నిబద్ధతతో ఉంటామని.. ఏం చెప్తామో.. అదే చేస్తామని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. 

Read: ఏపీ లో కొత్తగా  54 కరోనా పాజిటివ్ కేసులు