ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం.. జరిగింది కదా అని అరెస్టు చేయలేం..తొందర పాటు వద్దు – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 07:51 AM IST
ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం.. జరిగింది కదా అని అరెస్టు చేయలేం..తొందర పాటు వద్దు – సీఎం జగన్

ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగింది కదా..అరెస్టు చేయమనడం కరెక్టు కాదు..విచారణ జరగకుండా..ప్రభుత్వం దురుసుగా ఉంటే వ్యవహరిస్తే ఎలా ఉండేది అని ప్రశ్నించారు సీఎం జగన్. విచారణ జరుగకుండా దురుసుగా ప్రభుత్వంపై విమర్శలు వచ్చేవని, పారిశ్రామిక రంగంలో భయాందోళనలకు ఆస్కారం జరిగి ఉండేదన్నారు. మన పాలన – మీ సూచన పేరిట వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగా 2020, మే 28వ తేదీ గురువారం పరిశ్రమలు – పెట్టుబడులపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. అదే సమయంలో ఏ చర్యా తీసుకోకపోతే ప్రజలు చనిపోతారు, వారికి కష్టం కలుగుతుందన్నారు. ప్రభుత్వం సరిగ్గా పని చేయలేదనే విమర్శలు కూడా చేస్తారని, రాష్ట్రానికి తండ్రిలా ఉన్నప్పుడు మనకు అభివృద్ధి కావాలి..అదే క్రమంలో..అభివృద్ధి వల్ల ప్రజలకు నష్టం జరక్కూడదన్నారు. అందుకనే ఎల్టీపాలిమర్స్‌ విషయంలో అత్యంతవేగంగా కంపెనీ యాజమాన్యం హెల్ప్ తీసుకున్న అనంతరం బాధితులు సహాయం చేయాలని అనుకోలేదన్నారు.

రూ.40 కోట్లు ఖర్చు చేశామని, కేవలం 10 రోజుల్లో సహాయాన్ని అందించామన్నారు. ప్రభుత్వ పరంగా..ఏంచేయాలో అదిచేశామన్నారు. ప్రభుత్వం తరఫన వారిలో విశ్వాసాన్ని కల్పించామన్నారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే అధికార యంత్రాంగం అక్కడ దిగిందని, బాధితులకు మేలు జరిగే విధంగా చూశామన్నారు. సెంట్రల్ గవర్నర్ కమిటీలు కూడా ఇక్కడకు వచ్చి పరిశీలించాయని, ప్రభుత్వం నియమించిన కమిటీలతో పనిచేస్తున్నాయన్నారు. పరిశ్రమలో ఎందుకు ప్రమాదం జరిగింది ? బెల్ ఎందుకు మోగలేదు ? తదితర వాటిపై విచారణ జరిగిందన్నారు.

కమిటీల నుంచే కాకుండా…ప్రజల దగ్గరి నుంచి అభిప్రాయాలు సేకరించామన్నారు. విచారణ పూర్తయ్యిందని, కంపెనీని అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసి ఉంచామని..దీనికి కంపెనీ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలన్నారు. కంపెనీ యాజమాన్యం ఇచ్చిన సమాధానాలను బేరీజు వేసుకుని..అప్పుడు యాక్షన్ తీసుకుంటామని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరెంజ్, రెడ్ కేటగిరిల్లో ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలు రాకూడదని, పొల్యూషన్ యాక్ట్ ను మారుస్తున్నామన్నారు సీఎం జగన్. 

Read: హోదా వస్తుంది : గత ప్రభుత్వం చెప్పినట్టు నేను చెప్పను..ఏం చెప్తామో..అదే చేస్తాం – సీఎం జగన్