Ysr Rythu Bharosa : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.7500, రైతు భరోసా నిధుల విడుదల
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. కరోనా కష్టకాలంలో రైతులకు అండగా నిలిచారు. గురువారం(మే 13,2021) వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేశారు సీఎం జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా

Ysr Rythu Bharosa
Ysr Rythu Bharosa : కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. కరోనా కష్టకాలంలో రైతులకు అండగా నిలిచారు. గురువారం(మే 13,2021) వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేశారు సీఎం జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులు ఖాతాలో వరుసగా మూడో ఏడాది కూడా నేరుగా డబ్బులను జమ చేశారు సీఎం జగన్. ఒక్కో రైతు ఖాతాలోకి ఏ ఏడాది తొలి విడతగా రూ.7వేల 500 జమ చేశారు. రైతులకు ఏటా పెట్టుబడి సాయంగా రూ.13వేల 500 అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. 23నెలల పాలనలో ఎక్కడా వివక్ష లేకుండా ప్రతి అర్హుడికి న్యాయం చేశామన్నారు.
కరోనా కష్టకాలంలో ఆర్థిక వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటీకి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఆయన ఈ నిధులు విడుదల చేశారు.
”రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటివరకు రూ.89 వేల కోట్లు ప్రజల ఖాతాలోకి నేరుగా పంపాం. గత 23 నెలల్లో రైతు భరోసా కింద రూ.17 వేల 29 కోట్లు విడుదల చేశాం. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.1,038 కోట్లు ఇచ్చాం” అని సీఎం జగన్ వివరించారు. 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. రైతుభరోసా-పీఎం కిసాన్ పథకంలో భాగంగా మూడో ఏడాదికి తొలి విడత సాయమందిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే ఎక్కువగానే ఇస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు.