CM Jagan Tour : మాకు హక్కుగా ఇచ్చిన నీళ్లను వాడుకొంటే తప్పేముంది – సీఎం జగన్

తమకు హక్కుగా, కేటాయింపులు ఇచ్చినట్లుగా నీళ్లను వాడుకొంటే తప్పేంటీ ? అని ప్రశ్నించారు సీఎం జగన్. జల వివాదాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని తెలిపారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు..పాలమూరు - రంగారెడ్డి, డిండి..ఇతర ఎత్తిపోతల ప్రాజెక్టులు కడుతుంటే ఏం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

CM Jagan Tour : మాకు హక్కుగా ఇచ్చిన నీళ్లను వాడుకొంటే తప్పేముంది – సీఎం జగన్

Jagan Speech

CM Jagan Rayalaseema Tour : తమకు హక్కుగా, కేటాయింపులు ఇచ్చినట్లుగా నీళ్లను వాడుకొంటే తప్పేంటీ ? అని ప్రశ్నించారు సీఎం జగన్. జల వివాదాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని తెలిపారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు..పాలమూరు – రంగారెడ్డి, డిండి..ఇతర ఎత్తిపోతల ప్రాజెక్టులు కడుతుంటే ఏం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీటి విషయాల్లో రాజకీయాలు జరుగుతున్నాయని అభివర్ణించారు.

Read More : Labourer Lakhs YouTube : ఇతడో రోజువారీ కూలీ.. యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదిస్తున్నాడు!

రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి : –
అన్ని రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలని ఆకాంక్షించారు. 2021, జూలై 08వ తేదీ గురువారం రాయదుర్గం రైతు దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జలవివాదంపై ఆయన స్పందించారు. రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో నీటి కేటాయింపులు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయిన అనంతరం 2015, జూన్ 19వ తేదీన నీటి కేటాయింపులు చేపట్టాయని, రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 297 టీఎంసీలు నీళ్ల కేటాయింపులు జరిగాయన్నారు.

Read More : Gold-Silver Prices Drop : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

రాయలసీమ పరిస్థితి గమనించాలి : –
కేంద్రం, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సంతకాలు పెట్టాయని గుర్తు చేశారాయన. రాయలసీమ పరిస్థితి ఒక్కసారి గమనించాలని, పోతిరెడ్డి పాడులో 881 అడుగులు చేరితే తప్ప..నీళ్లు కిందకు రాని పరిస్థితి నెలకొందన్నారు. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ 885 అడుగులు ఉందని, గత 20 సంవత్సరాల కాలంగా.. 20 నుంచి 25 రోజుల్లో 881 అడుగులకు పైగా ఫుల్ వాటర్ ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి..లలో 800 అడుగుల లోపే నీరు తీసుకొనే వెసులుబాటు ఉందన్నారు.

Read More :Pearls Harvest : ఇంట్లోనే ముత్యాలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్న రైతు

ఇతర రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టలేదు : –
796 అడుగులలోపునే కరెంటు జనరేట్ చేసే పరిస్థితి ఈనాడు కనిపిస్తోందని, 800 అడుగుల వద్ద తెలంగాణ ప్రభుత్వం నీళ్లు వాడుకుంటున్నప్పుడు అదే 800 అడుగుల వద్ద మేం వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలతో సఖ్యత ఉండాలని కోరుకోవడం జరుగుతుందని, పాలకుల మధ్య సఖ్యత ఉంటేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదని, రానున్న రోజుల్లో కూడా వేలు పెట్టనని చెబుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలని ఆకాంక్షించారు సీఎం జగన్.