నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆదేశం

ఉద్యోగాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(జనవరి 31,2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ,

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 09:29 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆదేశం

ఉద్యోగాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(జనవరి 31,2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ,

ఉద్యోగాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(జనవరి 31,2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులను ఆశిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఆ రెండు రంగాల్లో అవసరమైన పోస్టులన్నింటిని భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలన్నారు.

పోలీసు శాఖలోనూ అవసరమైన సిబ్బందిని నియమించాలని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికే స్కూల్స్ లో నాడు-నేడు ద్వారా ఆసుపత్రులను బాగు చేస్తున్నామన్నారు. సరిపడా సిబ్బంది లేకపోతే స్కూళ్లపై ఎంత డబ్బు పెట్టినా వృథా అవుతుందని, స్కూల్ సమర్థత తగ్గుతుందన్నారు. స్కూళ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఉండాలన్నారు. రెవెన్యూ విభాగంలో కూడా ప్రాధాన్యమైన పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ సర్వే సిబ్బందికి అవసరమైన పరికరాలను సమకూర్చాలన్నారు.

శాఖల వారీగా ప్రాధాన్యతలు నిర్దారించుకుని ఉద్యోగాల భర్తీలపై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులతో సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగంలో భర్తీ చేయాల్సిన పోస్టులపై చర్చించాలని సీఎం అన్నారు. దీనికి స్పందించిన అధికారులు మరో మూడు వారాల్లో పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందిస్తామని సీఎం జగన్ తో చెప్పారు. ఫిబ్రవరి 21న సీఎంతో మరోసారి సమావేశమై ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ తెలియజేనున్నారు అధికారులు.

* ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష
* విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులను ఆశిస్తున్నాం
* విద్య, వైద్య రెండు రంగాల్లో అవసరమైన పోస్టులన్నింటిని భర్తీ చేయాలి
* పోలీసు శాఖలో అవసరమైన సిబ్బందిని నియమించాలి
* స్కూల్స్ లో నాడు-నేడు ద్వారా ఆసుపత్రులను బాగు చేస్తున్నాం

* డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలి
* సరిపడా సిబ్బంది లేకపోతే స్కూళ్లపై ఎంత డబ్బు పెట్టినా వృథా
* స్కూళ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఉండాలి
* రెవెన్యూ విభాగంలో కూడా ప్రాధాన్యమైన పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలి
* రెవెన్యూ సర్వే సిబ్బందికి అవసరమైన పరికరాలను సమకూర్చండి

* ఫిబ్రవరి 21న మరోసారి సీఎం జగన్ తో అధికారులు సమావేశం
* మరో 3 వారాల్లో పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందిస్తామన్న అధికారులు
* ప్రభుత్వంలోని ప్రతి విభాగంలో భర్తీ చేయాల్సిన పోస్టులపై చర్చించాలన్న సీఎం

Also Read : చంద్రబాబుకి షాక్ : జగన్ తో టచ్‌లో 17మంది టీడీపీ ఎమ్మెల్యేలు