CM Jagan : కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందించాలి : సీఎం జగన్

కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని ఆదేశించారు.

CM Jagan : కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందించాలి : సీఎం జగన్

Cm Jagan

CM Jagan review on covid control : కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని, ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని ఆదేశించారు. అంతకంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలన్నారు. గురువారం (మే 6, 2021) క్యాంప్‌ కార్యాలయంలో కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలని చెప్పారు. అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలన్నారు.

బెడ్ల సంఖ్య మరింత పెంచాలి
రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నామని, మన రికార్డులను మనమే బద్దలు కొడుతున్నామని చెప్పారు. కోవిడ్‌ చికిత్స కోసం అవసరం మేరకు బెడ్ల సంఖ్య మరింత పెంచాలన్నారు. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, అంతకంటే ఎక్కువ రోగులు వచ్చినా విధిగా చేర్చుకోవాలన్నారు. తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలని చెప్పారు. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం బెడ్లు ఇవ్వాలని పేర్కొన్నారు. అందుకోసం ఆయా ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేసి, వాటిలో సగం బెడ్లు మీరే కేటాయించాలని తెలిపారు. కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలని ఆదేశించారు. ఇందులో ఎక్కడా తేడా రాకూడదన్నారు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌లో ఉన్న వాటితో సహా, అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స ఒకేలా ఉండాలని సూచించారు.

ఆస్పత్రిలో బెడ్లపై స్పష్టత
ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో ఉన్న బెడ్లు ఎన్ని? వాటిలో ఎన్ని కోవిడ్‌ రోగులకు ఇస్తున్నారు? అన్నదానిపై పూర్తి క్లారిటీ ఉండాలన్నారు. దాని వల్ల ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఇస్తున్నామన్నది స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులలో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఉన్నాయన్న దానిపై పూర్తి స్పష్టత ఉంటుందని తెలిపారు. ఆ విధంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు అన్నింటిలో కలిపి కోవిడ్‌ రోగులకు మొత్తం ఎన్ని బెడ్లు ఉన్నాయన్నది తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్లు, ప్రైవేటు ఆస్పత్రుల బెడ్లు ఎన్నెన్ని అన్నదానిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

కోవిడ్‌ రోగులకు ఉచితంగా వైద్య సేవలు
104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ వెళ్తుందన్నారు. వెంటనే కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలన్నారు. ఇది ప్రక్రియ. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలని చెప్పారు. కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల వద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్లు హ్యాంగర్లు పెట్టి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఆస్పత్రి వైద్యులే అక్కడ కూడా సేవలందిస్తారని, అన్ని వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలని తెలిపారు.

రాష్ట్రంలో 598 ఆస్పత్రులు
రాష్ట్రంలో ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రులు, 349 కార్పొరేట్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు, 47 కార్పొరేట్‌ టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు, 94 ప్రైవేట్‌ కేటగిరీ ఆస్పత్రులు ఉన్నాయని తెలిపారు. మొత్తం 598 ఆస్పత్రుల్లో 48,439 బెడ్లు ఉండగా వాటిలో 41,517 మంది చికిత్స పొందుతున్నారని, మరో 6922 బెడ్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆస్పత్రులలో ఉన్న వారిలో 24,500 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్‌ బాగుండాలి
కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్‌ బాగుండాలని, ఎక్కడా ఏ లోపం లేకుండా ఉండాలన్నారు. శానిటేషన్, క్వాలిటీ ఫుడ్, డాక్టర్ల అందుబాటు, ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, ఆక్సీజన్‌.. ఈ ఐదు చాలా ముఖ్యమని తెలిపారు. వైద్యులు లేకపోతే వెంటనే తాత్కాలికంగా అయినా నియామకాలు చేపట్టలన్నారు.

ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలో లోపం ఉండకూడదు
ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదని, ఎక్కడైనా అవసరం అయితే తగిన మరమ్మతులు చేయాలని తెలిపారు. కేంద్రం ఇంకా ఎక్కువ ఆక్సిజన్‌ సరఫరా చేసేలా కృషి చేయడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయాలు ఏమిటన్నది ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రతి టీచింగ్‌ ఆస్పత్రి వద్ద 10 కెఎల్‌ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కెఎల్‌ సామర్థ్యంతో ఆక్సిజన్‌ స్టోరేజీ ఉండాలని, వీలైనంత త్వరగా అవి ఏర్పాటు కావాలన్నారు. రోజుకు 500 టన్నుల ఆక్సిజన్‌ కావాలంటే, ఏం చేయాలన్నది ఆలోచించాలని వెల్లడించారు. ఆక్సిజన్ సరఫరా, నిల్వ ఎలా అన్నది అంశాన్ని పరిశీలించాలన్నారు.