స్వయంగా ఇంటికెళ్లి రూ.7లక్షలు ఇవ్వండి : కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం

ఏపీ సీఎం జగన్.. కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యంపై

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 10:24 AM IST
స్వయంగా ఇంటికెళ్లి రూ.7లక్షలు ఇవ్వండి : కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం

ఏపీ సీఎం జగన్.. కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యంపై

ఏపీ సీఎం జగన్.. కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. పరిహారం చెల్లింపు విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లను సీఎం జగన్ ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు వెంటనే రూ.7లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. కలెక్టర్లు స్వయంగా రైతు కుటుంబాల ఇంటికి వెళ్లి పరిహారం చెక్కులు ఇవ్వాలన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఫిబ్రవరి 12న రూ.5లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం జగన్ చెప్పారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై మంగళవారం(డిసెంబర్ 31,2019) కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల అంశం చర్చకు రాగా జగన్ తీవ్రంగా స్పందించారు. ఆత్మహత్యలతో పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు సాయం అందించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందన్నారు. ప్రతీ జిల్లాకు కోటి రూపాయలు రిజర్వులో ఉంచినా ఇంకా చాలా రైతు కుటుంబాలకు సాయమెందుకు అందలేదని కలెక్టర్లపై సీరియస్ అయ్యారు.

2014-2018 మధ్యకాలంలో 566 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ కుటుంబాలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని జగన్ అన్నారు. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని జగన్ ఆరోపించారు. అధికారులు అన్నింటినీ పరిశీలించి 566 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారని, మరి పరిహారం చెల్లించడంలో జాప్యానికి కారణమేంటని కలెక్టర్లను ప్రశ్నించారు సీఎం జగన్.

గత ఆరు నెలల కాలంలో 121 మంది ఆత్మహత్య చేసుకుంటే అందులో చాలామంది కుటుంబాలకు డబ్బు అందలేదన్నారు. ఆ కుటుంబాలకు రూ.7 లక్షలు చొప్పున పరిహారం పంపిణీ చేయాలని జగన్ చెప్పారు. ఈ మొత్తాన్ని అన్‌-ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో వేయాలని సూచించారు. ఈ డబ్బు మీద అప్పుల వాళ్లు, బ్యాంకుల వాళ్లు ఎలాంటి క్లెయిం చేయకూడదని స్పష్టం చేశారు. ప్రతి కలెక్టర్‌.. రైతు కుటుంబాల దగ్గరికి స్వయంగా వెళ్లాలని, వారికి పరిహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. 2014 నుంచి ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ఎలాంటి సాయం అందని రైతుల కుటుంబాలను పిలిపించి రూ.5 లక్షల చొప్పున ఫిబ్రవరి 12న చెక్కులు పంపిణీ చేయాలని సీఎం చెప్పారు.