CM Jagan : నకిలీ చలాన్ల అంశంపై సీఎం జగన్ సీరియస్

నకిలీ చలానాల అంశంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు.

CM Jagan : నకిలీ చలాన్ల అంశంపై సీఎం జగన్ సీరియస్

Jagan

CM Jagan serious over fake challans : నకిలీ చలానాల అంశంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. నకిలీ చలాన్ల ఎపిసోడ్ లో అధికారులపై జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదన్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు.

తప్పులకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్‌ చేశామని అధికారులు వివరణ ఇచ్చారు. ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే.. ఎందుకు మన దృష్టికి రావడం లేదన్నారు. ఎప్పటి నుంచి, ఎన్ని రోజుల నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయని అడిగారు. క్షేత్రస్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయా?లేవా?ఎందుకు చూడ్డంలేదు? అని ప్రశ్నించారు.

క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకోవాలన్నారు. అవినీతిపై ఎవరికి కాల్‌ చేయాలో ప్రతి ఆఫీసులోనూ ఫోన్‌ నంబర్‌ ఉంచాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నంబర్‌ ఉండాలని సూచించారు. కాల్‌ సెంటర్‌కు వచ్చే కాల్స్‌ మీద అధికారులు దృష్టి పెట్టాలన్నారు. కాల్‌ సెంటర్‌ మీద అధికారులు ఓనర్‌ షిప్‌ తీసుకోవాలని పేర్కొన్నారు. అవినీతిని నిర్మూలించడానికి సరైన ఎస్‌ఓపీలను తీసుకురావాలన్నారు.

కేవలం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే కాదు, అన్ని కార్యాలయాల్లో చలానాల చెల్లింపు ప్రక్రియను పరిశీలన చేయాలన్నారు. నకిలీ చలాన్లపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. మీ–సేవల్లో పరిస్థితులపైనా కూడా పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. కనీసంగా వారం – పది రోజులకు ఒకసారి అధికారులు సమావేశం కావాలన్నారు.

మద్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, కల్తీలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీని వల్ల సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న ఘటనలు చూస్తున్నామని తెలిపారు. ఇలాంటి వ్యవహారాలపై కచ్చితంగా ఉక్కుపాదం మోపాలన్నారు.