CM Jagan: థర్డ్ వేవ్ వచ్చినా సిద్ధంగా ఉండాలి.. చిన్నారులకు చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ ఉంచండి- సీఎం

కొవిడ్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. థర్డ్‌వేవ్‌ సమాచారంతో శిశువులు, చిన్నారుల వైద్యంపై తీసుకోవాల్సిన చర్యలు, జిల్లాకేంద్రాల్లో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై వంటి అంశాలపై మాట్లాడారు.

CM Jagan: థర్డ్ వేవ్ వచ్చినా సిద్ధంగా ఉండాలి.. చిన్నారులకు చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ ఉంచండి-  సీఎం

Cm Jagan Special Focus On Covid Third Wave

CM Jagan: కొవిడ్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. థర్డ్‌వేవ్‌ సమాచారంతో శిశువులు, చిన్నారుల వైద్యంపై తీసుకోవాల్సిన చర్యలు, జిల్లాకేంద్రాల్లో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై వంటి అంశాలపై మాట్లాడారు. థర్డ్‌ వేవ్‌ వస్తుందనే సమాచారం నేపథ్యంలో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో శిశువులకు వైద్యచికిత్స సదుపాయాలపై అధికారులు వివరణ ఇచ్చారు.

శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. ఆక్సిజన్‌ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3వేల 777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాటితో పాటుగా చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సహాయక సిబ్బంది కొరత లేకుండా చూసుకుంటున్నామన్నారు.

ఈ పనులన్నింటినీ నెలరోజుల్లోగా పూర్తిచేయాలని సీఎం వారికి ఆదేశాలిచ్చారు. భవిష్యత్ లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. పీడియాట్రిక్‌ అంశాలల్లో నర్సులకు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అధికారులు తెలిపారెు. ఊపిరిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తున్నాయని స్పష్టం చేశారు. వీటిపై స్పందించిన సీఎం అటువంటి వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని అన్నారు.

దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా ఆరోగ్యశ్రీ నిలిచే విధంగా, వాస్తవిక దృక్పథంతో ఆలోచించి రేట్లు ఫిక్స్‌ చేయాలని సీఎం సూచించారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు మూడు వారాలలోపే బిల్లులు చెల్లిస్తున్నాం. ఆరోగ్య శ్రీ కింద ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు దేశంలో కొత్త ఒరవడికి నాంది పలికాయి. బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం అమల్లో బాధ్యత, విశ్వసనీయత చాలా ముఖ్యం.

సకాలంలో బిల్లులు చెల్లింపు అనేది ఆరోగ్యశ్రీ పథకం విశ్వసనీయతను పెంచుతుంది. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఆరోగ్యా ఆసరా కూడా ఒక విప్లవాత్మక చర్య. ప్రతిరోజూ ఆరోగ్య శ్రీ పథకంపై దృష్టి పెట్టాలి. అలా జరిగితేనే పేదవాడి మొహంలో చిరునవ్వు చూడగలుగుతాం

హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్ష:
జిల్లాలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు విషయంలో అధికారులకు కొన్ని సూచనలు చేశారు సీఎం. జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు తీసుకురావాలి. దీనివల్ల ప్రజలకు చేరువలో ఆస్పత్రులు ఉంటాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు, టెక్నాలజీ, సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే హెల్త్‌ హబ్స్‌ వెనుక ప్రధాన ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు.

ఉత్తమ వైద్యసేవల విషయంలో ఒక జిల్లాలో పరిస్థితి మెరుగుపడడానికి సంబంధిత హెల్త్‌ హబ్‌కింద హాస్పిటల్స్ తీసుకురావాలి. వైద్యసేవలను అందించే విషయంలో జిల్లాలు ఈ హెల్త్‌ హబ్‌లద్వారా స్వయం సమృద్ధి సాధించాలి. సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు ప్రతి జిల్లాకూ అందుబాటులోకి రావాలి. 2 వారాల్లోగా హెల్త్‌ హబ్‌పై విధివిధానాలు ఖరారు చేయాలి.