CM Jagan : సమస్యలను పరిష్కరిస్తూ ప్రాజెక్టును నెలకొల్పాం – సీఎం జగన్

ఈ రోజు నిజంగా మంచి రోజని, అనపర్తిలో మూడు పేజ్ లో కలుపుకుని రూ. 2 వేల 400 కోట్లతో సుమారు 2 వేల 450 మందికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు. బిర్లా లాంటి వారు ప్రభుత్వం మీద నమ్మకంతో

CM Jagan : సమస్యలను పరిష్కరిస్తూ ప్రాజెక్టును నెలకొల్పాం – సీఎం జగన్

Jagan Grasim

CM Jagan: తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. నూతనంగా నిర్మించిన గ్రాసిమ్ ఇండస్ట్రీని ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన సీఎం జగన్… ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ రోజు నిజంగా మంచి రోజని, అనపర్తిలో మూడు పేజ్ లో కలుపుకుని రూ. 2 వేల 400 కోట్లతో సుమారు 2 వేల 450 మందికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు. బిర్లా లాంటి వారు ప్రభుత్వం మీద నమ్మకంతో ముందుకు రావడం మంచి పరిణామంగా అభివర్ణించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు అప్పటి ప్రభుత్వం అప్పగిస్తూ సంతకాలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

Read More : Minister Roja : మంత్రి రోజా సెల్ ఫోన్ దొరికింది.. ఎలా గుర్తించారు ?

సమస్యలను అలాగే ఉంచి సంతకాలు చేసేశారని ఎద్దేవా చేశారు. సుమారు 2 వేల 500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశ్యంతో ఇక్కడ సమస్యలను తీర్చే విధంగా అడుగులు వేయడం జరిగిందన్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్ధాల విషయంలో మెరుగైన సాంకేతికంగా చేసే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు. ఎక్కడ జీరో లిక్విడ్ వ్యర్థం లేకుండా యాజమాన్యంతో మాట్లాడి ముందుకు తీసుకెళ్లినట్లు, 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చట్టం చేయడం జరిగిందని సీఎం జగన్.

Read More : Andhra pradesh: వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ కాకాణి గోవర్ధన్ రెడ్డి

మరోవైపు సీఎం జగన్ 2022, ఏప్రిల్ 22వ తేదీ శుక్రవారం ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలో సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని హెలిప్యాడ్ వద్దకు వెళుతారు. అనంతరం 9.40 హెలిప్యాడ్ లో ఒంగోలుకు బయలుదేరి.. ఉదయం 10.10 గంటలకు రైల్వే స్టేషన్ సమీపంలో ఏబీఎం గ్రౌండ్ కు చేరుకుంటారు. 10.25 గంటలకు ఏబీఎం గ్రౌండ్ లోనే స్థానిక నాయకులు, అధికారులతో సమావేశంలో పాల్గొని రోడ్డు మార్గం గుండా రంగారాయుడు చెరువు వద్దనున్న పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. డ్వాక్రా గ్రూపుల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం జగన్ పరిశీలించిన అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్.