Taneti Vanitha On Ananthababu : సుబ్రమణ్యం హత్య కేసు.. సీఎం జగన్ న్యాయం పక్షాన నిలబడ్డారన్న హోంమంత్రి

నిష్పక్షపాతంగా ప్రభుత్వం, సీఎం జగన్ పని చేస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. తన మన బేధం లేకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

Taneti Vanitha On Ananthababu : సుబ్రమణ్యం హత్య కేసు.. సీఎం జగన్ న్యాయం పక్షాన నిలబడ్డారన్న హోంమంత్రి

Taneti Vanitha On Ananthababu

Taneti Vanitha On Ananthababu : కాకినాడలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయడం జరిగిందని ఏపీ హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం, సీఎం జగన్ నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఈ విషయాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి మండిపడ్డారు.

MLC Ananthababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు‌పై హత్య కేసు నమోదు

ఈ సందర్భంగా తానేటి వనిత బాలకృష్ణ కాల్పుల విషయాన్ని తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బోండా ఉమా కుమారుడు చేసిన యాక్సిడెంట్, కర్నూలులో వైస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి హత్య విషయంలో కేఈ హస్తం ఎంత ఉందో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం హంతకుల పక్షాన నిలబడిందని హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. ఈరోజు సీఎం జగన్ పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, న్యాయం పక్షాన నిలబడ్డారని చెప్పారు.(Taneti Vanitha On Ananthababu)

MLC AnanthaBabu In PoliceCustody : పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ అనంత బాబు

న్యాయం కోసం తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయడం ద్వారా స్పష్టం చేశారని హోంమంత్రి అన్నారు. నిష్పక్షపాతంగా ప్రభుత్వం, సీఎం జగన్ పని చేస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. సీఎం జగన్ హయాంలో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పాలన అందిస్తున్నాము అని చెప్పారు. అదే విధంగా న్యాయం, చట్టం విషయంలో కూడా ముఖ్యమంత్రి తన మన బేధం లేకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవడంతో పాటు పేదలు, దళితుల పక్షాన సీఎం జగన్ నిలబడ్డారని హోంమంత్రి పేర్కొన్నారు.

AmbatiRambabu On Ananthababu Row : చంద్రబాబులా.. తప్పు చేసినా కాపాడే తత్వం జగన్‌ది కాదు-మంత్రి అంబటి

ప్రతిపక్ష టీడీపీకి మాట్లాడడానికి కూడా అర్హత లేదన్నారు హోంమంత్రి వనిత. టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయాలు జరిగాయో, ఇప్పుడు ఎలాంటి న్యాయం జరుగుతోందో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని టీడీపీ నాయకులకు హితవు పలికారామె.

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎమ్మెల్సీ అనంతబాబు కలిశారని… హత్య కేసు నుంచి రక్షించాలని వారిని కోరారని లోకేశ్ ఆరోపించారు. మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని హోంమంత్రి వనిత ఇంత వరకు పరామర్శించకపోవడం బాధాకరం అన్నారు లోకేశ్.

కాగా, పోలీసుల విచారణలో అనంతబాబు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకోవడంతోనే తానే హత్య చేసినట్లు అనంతబాబు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను హత్య చేయాలని భావించలేదని.. బెదిరించి వదిలేద్దామనుకున్నట్లు అనంతబాబు పోలీసులతో చెప్పారట.