చెక్ చేసుకోండి.. బ్యాంకు ఖాతాలోకి రూ.15వేలు.. మరో హామీ నిలుపుకున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మరో హామీ నిలుపుకున్నారు. అమ్మఒడి పథకం ప్రారంభించారు. గురువారం(జనవరి 9,2020) చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ఆరంభించారు.

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 07:01 AM IST
చెక్ చేసుకోండి.. బ్యాంకు ఖాతాలోకి రూ.15వేలు.. మరో హామీ నిలుపుకున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మరో హామీ నిలుపుకున్నారు. అమ్మఒడి పథకం ప్రారంభించారు. గురువారం(జనవరి 9,2020) చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ఆరంభించారు.

ఏపీ సీఎం జగన్ మరో హామీ నిలుపుకున్నారు. అమ్మఒడి పథకం ప్రారంభించారు. గురువారం(జనవరి 9,2020) చిత్తూరులో పి.వి.కె.ఎన్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ఆరంభించారు. జగన్ ప్రకటించిన నవరత్నాల్లో మరో కీలక స్కీమ్ అమ్మఒడి. చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్న సంకల్పంతో సీఎం జగన్ ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు.. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ఏటా రూ.15వేలు ఆర్థికసాయంగా ఇస్తారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం.. అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు‌. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్‌ అకౌంట్‌లో ఏడాదికి 15వేల రూపాయలు వేస్తామని పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని ముందుగా ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అమలు చేయాలని భావించినా.. తరువాత ఇంటర్‌ వరకు వర్తింపజేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరింది.

బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.6వేల 500 కోట్లు కేటాయించారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా జనవరిలో నేరుగా అర్హులైన విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకులు బ్యాంక్‌ అకౌంట్లలో రూ.15వేల మొత్తాన్ని జమ చేస్తారు.

* అమ్మఒడి పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్
* పిల్లలను బడికి పంపే పేద తల్లులకు సీఎం కానుక
* అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లికి రూ.15వేలు ఆర్థికసాయం
* 43లక్షల మంది తల్లులకు.. 82లక్షల మంది విద్యార్థులకు లబ్ది
* 1 నుంచి 12వ తరగతి(ఇంటర్) చదివే పిల్లలకు వర్తింపు
* ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు వర్తింపు
* అమ్మఒడి పథకం కోసం రూ.6వేల 456 కోట్లు కేటాయింపు