చెక్ చేసుకోండి, వారి ఖాతాల్లో రూ.10వేలు వేసిన జగన్ ప్రభుత్వం, ఏపీలో మరో సంక్షేమ పథకం ప్రారంభం

సీఎం జగన్ మరో ఎన్నికల హామీని నిలుపుకున్నారు. కరోనా సంక్షోభ సమమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ మరో సంక్షేమ

  • Published By: naveen ,Published On : June 10, 2020 / 05:59 AM IST
చెక్ చేసుకోండి, వారి ఖాతాల్లో రూ.10వేలు వేసిన జగన్ ప్రభుత్వం, ఏపీలో మరో సంక్షేమ పథకం ప్రారంభం

సీఎం జగన్ మరో ఎన్నికల హామీని నిలుపుకున్నారు. కరోనా సంక్షోభ సమమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ మరో సంక్షేమ

సీఎం జగన్ మరో ఎన్నికల హామీని నిలుపుకున్నారు. కరోనా సంక్షోభ సమమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ మరో సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. బుధవారం(జూన్ 10,2020) ”జగనన్న చేదోడు” పథకాన్ని క్యాంప్ ఆఫీస్ నుంచి ఆన్ లైన్ లో ప్రారంభించారు సీఎం జగన్. ఈ పథకం కింద షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ల కుటుంబాలకు ఏడాదికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. లబ్దిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.10వేలు వేసింది. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కచ్చితంగా అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. తమ చెమటను మాత్రమే నమ్ముకుని పని చేస్తున్న గొప్పవారి కోసం ఈ పథకం ప్రారంభించామన్నారు. అర్హుల్లో లక్షా 26వేల 926 మంది టైలర్లు, 82వేల 347 మంది రజకులు, 38వేల 767 మంది నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. టైలర్లకు రూ. 125,92,60.. రజకులకు రూ. 82,34,70, నాయీ బ్రాహ్మణులకు రూ. 38,76,70 సాయం అందింది.

2లక్షల 47వేల 40 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం:
ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందింది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడింది ప్రభుత్వం. లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు. వృత్తికి కావాల్సిన పనిమూట్లను కొనుగోలు చేసుకునేందుకు ఈ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. 

కుల వృత్తులపై ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తున్న వారి కోసం:
కుల వృత్తులపై ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తున్న వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ఉద్దేశించినది జగనన్న చేదోడు పథకం. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఈ పథకానికి రూపకల్పన చేసింది జగన్ ప్రభుత్వం. జగనన్న చేదోడు పథకం కింద బీసీ కార్పొరేషన్ ద్వారా ఇదివరకే దరఖాస్తులను ఆహ్వానించింది. 5లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. నిబంధనల ప్రకారం వాటన్నింటినీ వడపోశారు. రెండున్నర లక్షలకు పైగా దరఖాస్తుదారులను ఈ పథకం కిందికి చేర్చారు. వారి ఖాతాల్లో 10 వేల రూపాయల మొత్తాన్ని జమ చేసింది ప్రభుత్వం.

ఈ పథకం ప్రారంభించడానికి ఇదే సరైన సమయం:
కులవృత్తుల మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న వారిని ఆర్థికంగా ఆదుకుంటామంటూ ఎన్నికల ప్రచార సమయంలో జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జగనన్న చేదోడు పథకం కింద నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదనే అభిప్రాయాన్ని వైసీపీ నాయకులు వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్ ప్రభావం ఆయా వర్గాల ప్రజలపై తీవ్రంగా పడింది. లాక్‌డౌన్ వల్ల చాలా రోజులుగా బార్బర్ షాపులు మూతపడ్డాయి. టైలర్లు తమ దుకాణాలను తెరవలేదు. రజకులు దాదాపు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వారంతా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జగనన్న చేదోడు పథకం కింద ఆయా వర్గాల ప్రజలకు 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం సరైన నిర్ణయం అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలు ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. 

సీఎం జగన్ కామెంట్స్..
* జగనన్న చేదోడు పథకం కింద 2లక్షల 24వేల 40మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల సాయం
* మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తున్నాం
* అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలి
* అర్హత లేని వారికి మాత్రం సంక్షేమ ఫలాలు అందకూడదు
* పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం
* ఏడాది పాలనలో రూ.42,465 కోట్లను పేదల బ్యాంకు అకౌంట్లలో వేశం
* రాబోయే రోజుల్లో కూడా మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తా

Read: ఏపీలో SMs ద్వారా కరోనా పరీక్షల ఫలితాలు