3 రాజధానులకు దారేది : సుప్రీం సీనియర్ న్యాయవాదితో జగన్ కీలక చర్చలు

తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో జగన్ చర్చలు జరుపుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 04:50 AM IST
3 రాజధానులకు దారేది : సుప్రీం సీనియర్ న్యాయవాదితో జగన్ కీలక చర్చలు

తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో జగన్ చర్చలు జరుపుతున్నారు.

తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో జగన్ చర్చలు జరుపుతున్నారు. నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాలపై ప్రధానంగా డిస్కస్ చేస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపడంతో ఏం చేయాలనే దానిపై జగన్ మంతనాలు జరుపుతున్నారు.

నిన్నటి పరిణామాలపై న్యాయనిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలపై జగన్ చర్చ జరుపుతున్నారు. కాగా, అసెంబ్లీని ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఏపీ అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఈజీగా పాస్ చేసుకున్న జగన్ ప్రభుత్వానికి శాసనమండలిలో బిగ్ షాక్ తగిలింది. కీలక బిల్లులకు మండలి చైర్మన్ బ్రేక్ వేశారు. తన విచక్షణాధికారంతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు. దీంతో మూడు రాజధానులకు మూడు నెలల పాటు బ్రేక్ పడినట్టు అయ్యింది. మండలిలో సంఖ్యా బలం ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. తన వ్యూహలతో విజయం సాధించింది. బిల్లులను అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యింది.

* మండలి పరిణామాలపై సీఎం జగన్ సీరియస్
* పార్టీ ముఖ్యనేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జలతో భేటీ
* సమావేశానికి హాజరైన న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు
* బిల్లుల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చ
* న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలపై చర్చ

* బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్
* ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సీఎం జగన్ ఫోకస్
* సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీతో మంతనాలు
* న్యాయ, రాజ్యాంగపరమైన సూచనలు తీసుకుంటున్న ప్రభుత్వం
* అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో సీఎం జగన్

Also Read : 3 రాజధానుల కోసం : జగన్ ముందు మూడు ఆప్షన్లు