అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు, దిశ తరహాలో బిల్లు తేనున్న జగన్ ప్రభుత్వం

  • Published By: naveen ,Published On : August 24, 2020 / 02:16 PM IST
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు, దిశ తరహాలో బిల్లు తేనున్న జగన్ ప్రభుత్వం

అవినీతి నిరోధక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా బిల్లు తీసుకురానున్నారు. ‘దిశ’ తరహాలో బిల్లు తేవాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారు. 1902 నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలూ ఏసీబీకి చెందిన 14400కు బదలాయింపు చేయాలని నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం చేస్తారు. ఎమ్మార్వో, ఎండీఓ, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.



అలాగే ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్‌ టెండరింగ్‌ కు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. టెండర్‌ విలువ రూ.కోటి దాటితే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్‌ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుల విషయాల్లో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా స్పష్టం అయ్యిందని జగన్ కామెంట్ చేశారు.