ఏడాదిన్నర తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయం, ఇక పార్టీపై ఫుల్ ఫోకస్

  • Published By: naveen ,Published On : August 21, 2020 / 01:06 PM IST
ఏడాదిన్నర తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయం, ఇక పార్టీపై ఫుల్ ఫోకస్

గత ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోని అధిష్టానం.. ఇప్పుడు పార్టీపై దృష్టి సారించేందుకు ప్లాన్‌ చేసుకుంటోంది. గడచిన ఏడాదిన్నరగా పార్టీకి సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. సీఎం జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సైతం పార్టీ క్యాడర్‌ని లైట్ తీసుకున్నారు. దీంతో పార్టీ విషయంలో క్యాడర్‌లో జోష్ తగ్గిపోయింది. పాలన, ప్రభుత్వ వ్యవహారాల్లోనే పార్టీ నేతలంతా నిమగ్నమయ్యారు. కేవలం ప్రభుత్వం కార్యక్రమాలే తప్ప పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. పార్టీ అధిష్టానం సైతం ఒక్క కార్యక్రమానికి పిలుపునివ్వలేదు.



అధికారంలోకి వచ్చాక పార్టీని విస్మరిస్తున్నారనే అభిప్రాయం:
ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పార్టీ వల్లే.. కానీ అధికారంలోకి వచ్చాక పార్టీని విస్మరిస్తుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వచ్చింది. అంతే కాకుండా పార్టీ క్యాడర్ అధిష్టానానికి ఇదే విషయాన్ని చెప్పడం, పార్టీలో సీనియర్ నేతలు సైతం ఇదే విషయాన్ని సూచించడంతో పార్టీపై జగన్‌ ఫోకస్ పెట్టారని అంటున్నారు. దీంతో పార్టీని గతంలోలా యాక్టివ్ చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇకపై రెగ్యులర్‌గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వంపై వస్తున్న విమర్శల విషయంలో పార్టీ పరంగా సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ అధికార ప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారట.



పార్టీ కేడర్‌ని ఉత్సాహపరిచేలా ప్రణాళిక:
ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకి చెప్పడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని సూచనలు ఇచ్చారట. ఇక సోషల్ మీడియాలోనూ పార్టీని యాక్టివ్ చేయాలని ప్లాన్ చేశారు. ఎన్నికలకు ముందు ఫుల్ యాక్టివ్‌గా ఉన్న సోషల్ మీడియాను మళ్లీ జోరు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కేడర్‌ని ఉత్సాహపరిచేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా మొత్తానికి ఏడాదిన్నర తర్వాత పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్‌ అయ్యారు జగన్‌.