Jagananna Vasathi Deevena : నేడే.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.వెయ్యి కోట్లు జమ చేయనున్న సీఎం జగన్

జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేడు(ఏప్రిల్ 28,2021) నగదు జమ కానుంది. రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 2020-21 సంవత్సరానికి మొత్తం 10లక్షల 89వేల 302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు పడనుంది. క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా సీఎం జగన్ నగదు జమ చేస్తారు.

Jagananna Vasathi Deevena : నేడే.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.వెయ్యి కోట్లు జమ చేయనున్న సీఎం జగన్

Jagananna Vasathi Deevena

Jagananna Vasathi Deevena : కరోనా కష్ట కాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారు. వరుసగా పథకాలు ప్రారంభిస్తున్నారు. అర్హుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. తాజాగా జగనన్న వసతి దీవెన పథకం (వసతి, భోజన, రవాణా ఖర్చులకు) కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేడు(ఏప్రిల్ 28,2021) నగదు జమ చేయనున్నారు సీఎం జగన్. రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ జమ చేస్తారు. 2020-21 సంవత్సరానికి మొత్తం 10లక్షల 89వేల 302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బు పడుతుంది. క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా సీఎం జగన్ నగదు జమ చేస్తారు.

వసతి, భోజన ఖర్చులకు:
సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించిన సీఎం జగన్.. కరోనా కష్టకాలంలోనూ అమలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు మాత్రం ఆపడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం అన్నీ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల బంగారు భవితే లక్ష్యంగా గత వారం జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మొదటి త్రైమాసికం కింద రూ.671.45 కోట్లు వారి తల్లుల ఖాతాలకు సీఎం జగన్ జమ చేశారు. ఇప్పుడు వసతి, భోజన ఖర్చులకు జగనన్న వసతి దీవెన కింద రూ.1,048.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా..
పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అని చెప్పిన సీఎం జగన్.. వారి ఉన్నత విద్యకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తెచ్చిన పథకమే జగనన్న వసతి దీవెన. ఈ పథకం కింద ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన, రవాణ ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్న పిల్లలు ఉంటే అంతమందికీ వారి తల్లుల ఖాతాకు ఈ సొమ్ము జమ చేస్తుంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం లేదని ప్రభుత్వం చెబుతోంది.

జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఇప్పటికే రూ.1,220.99 కోట్లను చెల్లించారు. బుధవారం మొదటి విడతగా రూ.1,048.94 కోట్లను చెల్లిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన కింద రూ.2,269.93 కోట్లు చెల్లించినట్లు అవుతుంది. ఈ పథకంలో రెండో విడతగా మిగిలిన సొమ్ము డిసెంబర్ లో చెల్లిస్తారు.

ప్రతి పేదవాడు చదువుకోవాలి అనేది సీఎం జగన్ లక్ష్యం. చదువుకి పేదరికం అడ్డుకాకూడదని భావించిన సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పేదరికాన్ని నిర్మూలించేది చదువు మాత్రమే, పేదల జీవితాలు మార్చేది విద్య మాత్రమే అని సీఎం జగన్ బలంగా విశ్వసిస్తారు. ఇప్పటివరకూ జగన్‌ ప్రభుత్వం విద్యారంగంపై వివిధ పథకాల కింద సుమారు రూ. 25,812.60 కోట్లు ఖర్చు చేయగా.. 1,60,75,373 మంది లబ్ధి పొందారు. దీంతోపాటు నాడు-నేడు పథకం కింద ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్‌వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం ప్రభుత్వం మరో రూ. 1,800 కోట్లు వ్యయం చేస్తుంది.